IPL 2023: Details Of Impact Players Used By Various Teams In The Matches Held In IPL - Sakshi
Sakshi News home page

ఇంపాక్ట్‌ ప్లేయర్ల ఇంపాక్ట్‌ ఎంత.. ఏ జట్టు ఎక్కువ లాభపడింది..?

Published Thu, Apr 13 2023 3:35 PM | Last Updated on Thu, Apr 13 2023 5:08 PM

IPL 2023: Impact Of Impact Players - Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అనే ఆ‍ప్షన్‌ ప్రస్తుత ఎడిషన్‌ (2023) నుంచే మొదలైన విషయం తెలిసిందే. ఈ సరికొత్త నిబంధన ప్రకారం టాస్‌ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తారు. వీరిలో ఒకరిని సంబంధిత జట్టు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వినియోగించుకుంటుంది.  

ఇంపాక్ట్‌ ప్లేయర్‌ను ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు, వికెట్ పడిన తర్వాత, బ్యాటర్ రిటైర్ అయిన తర్వాత, ఓవర్ పూర్తయిన సందర్భాల్లో పరిచయం చేయవచ్చు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో అన్ని జట్లు ఈ అప్షన్‌ను విజయవంతంగా వినియోగించుకున్నాయి. లీగ్‌లో మున్ముందు అన్ని జట్లు ఈ ఆప్షన్‌ను ఇంకా బెటర్‌గా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

లీగ్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆప్షన్‌ను సక్సెసఫుల్‌గా వాడుకుందని చెప్పాలి. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌ సుయాశ్‌ శర్మ స్థానంలో వెంకటేశ్‌ అయ్యర్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించి, సక్సెస్‌ సాధించింది. ఆ మ్యాచ్‌లో అయ్యర్‌ 40 బంతుల్లో 83 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 

లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వివిధ జట్లు వినియోగించుకున్న ఇంపాక్ట్‌ ప్లేయర్ల వివరాలు..

  • గుజరాత్‌ వర్సెస్‌ సీఎస్‌కే: అంబటి రాయుడు స్థానంలో తుషార్‌ దేశ్‌పాండే, కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో సాయి సుదర్శన్‌
  • పంజాబ్‌ వర్సెస్‌ కేకేఆర్‌: వరుణ్‌ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్‌ అయ్యర్‌, భానుక రాజపక్ష స్థానంలో రిషి ధవన్‌
  • లక్నో వర్సెస్‌ డీసీ: ఆయుష్‌ బదోని స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో అమాన్‌ ఖాన్‌
  • సన్‌రైజర్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌: ఫజల్‌హక్‌ ఫారూఖీ స్థానంలో అబ్దుల్‌ సమద్‌, యశస్వి జైస్వాల్‌ స్థానంలో నవ్‌దీప్‌ సైనీ
  • ఆర్సీబీ వర్సెస్‌ ముంబై: సూర్యకుమార్‌ యాదవ్‌ స్థానంలో బెహ్రెన్‌డార్ఫ్‌
  • సీఎస్‌కే వర్సెస్‌ లక్నో: ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో బదోని, రాయుడు స్థానంలో తుషార్‌ దేశ్‌పాండే
  • ఢిల్లీ వర్సెస్‌ గుజరాత్‌: సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో ఖలీల్‌అహ్మద్‌, జాషువ లిటిల్‌ ప్లేస్‌లో విజయ్‌ శంకర్‌
  • రాజస్థాన్‌ వర్సెస్‌ పంజాబ్‌: చహల్‌ ప్లేస్‌లో దృవ్‌ జురెల్‌, ప్రభ్‌సిమ్రన్‌ స్థానంలో రిషి ధవన్‌
  • కేకేఆర్‌ వర్సెస్‌ ఆర్సీబీ: వెంకటేశ్‌ అయ్యర్‌ స్థానంలో సుయాశ్‌ శర్మ, సిరాజ్‌ప్లేస్‌లో అనూజ్‌ రావత్‌
  • లక్నో వర్సెస్‌ సన్‌రైజర్స్‌: రాహుల్‌ త్రిపాఠి ప్లేస్‌లో ఫజల్‌హక్‌ ఫారూకీ, అమిత్‌ మిశ్రా స్థానంలో బదోని
  • రాజస్థాన్‌ వర్సెస్‌ ఢిల్లీ: ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో పృథ్వీ షా, బట్లర్‌ ప్లేస్‌లో మురుగన్‌ అశ్విన్‌
  • ముంబై వర్సెస్‌ సీఎస్‌కే: టిమ్‌ డేవిడ్‌ స్థానంలో కుమార్‌ కార్తికేయ, దీప్‌ చాహర్‌ స్థానంలో రాయుడు
  • గుజరాత్‌ వర్సెస్‌ కేకేఆర్‌: సాయి సుదర్శన్‌ స్థానంలో జాషువ లిటిల్‌, సుయాశ్‌ ప్లేస్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌
  • సన్‌రైజర్స్‌ వర్సెస్‌ పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ స్థానంలో సికందర్‌ రజా
  • ఆర్సీబీ వర్సెస్‌ లక్నో: అమిత్‌ మిశ్రా స్థానంలో బదోని, అనూజ్‌రావత్‌ ప్లేస్‌లో కర్ణ్‌ శర్మ
  • ఢిల్లీ వర్సెస్‌ ముంబై: పృథ్వీ షా స్థానంలో ముకేశ్‌ కుమార్‌
  • సీఎస్‌కే వర్సెస్‌ రాజస్థాన్‌: బట్లర్‌ స్థానంలో జంపా, మగాలా ప్లేస్‌లో రాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement