నితీశ్ రాణా- యశస్వి జైశ్వాల్ (PC: IPL)
IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్-2023లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం..
మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, స్పిన్‌తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్ నరైన్.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్ శర్మ.. అతడి తోడుగా అనుకూల్ రాయ్.. జట్టులో ఇంత మంది స్పిన్ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు.
సీజన్ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్ కోసం పార్ట్ టైమ్ స్పిన్నర్‌ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో
నితీశ్ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్‌కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా నిర్ణయంపై కేకేఆర్ ఫ్యాన్స్ సైతం మండిపడుతున్నారు.
తప్పు చేశాను!
ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్ సారథి నితీశ్ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు.
టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్ స్పిన్నర్‌ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్ అద్భుతం’’ అని మొదటి ఓవర్ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు.
మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా
అయితే, కేకేఆర్ స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మాత్రం నితీశ్ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్‌లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్‌తో బౌలింగ్ చేయించడం మంచి ఆప్షన్.
కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్ తొలి ఓవర్లోనే వికెట్ తీసి ఉంటే అది మాస్టర్‌స్ట్రోక్ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ 57 పరుగులతో కేకేఆర్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్ బ్యాటర్ అయిన నితీశ్.. రైట్ ఆర్మ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా!
కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్
వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
టాస్: రాజస్తాన్ - బౌలింగ్
కేకేఆర్ స్కోరు: 149/8 (20)
రాజస్తాన్ స్కోరు: 151/1 (13.1)
విజేత: రాజస్తాన్ రాయల్స్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యశస్వి జైశ్వాల్.
చదవండి: రనౌట్ విషయంలో సంజూ భాయ్ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్
గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా!
The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN
— JioCinema (@JioCinema) May 11, 2023
150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls.
— IndianPremierLeague (@IPL) May 11, 2023
Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI
Comments
Please login to add a commentAdd a comment