
PC: IPL.com
ఐపీఎల్-2023లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా బౌలర్లను రాజస్తాన్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా జైశ్వాల్ కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాకు చుక్కలు చూపించాడు.
కాగా జట్టులో శార్ధూల్ ఠాకూర్, రస్సెల్, వరుణ్ చక్రవర్తి వంటి స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ.. నితీష్ రాణా రాజస్తాన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసేందుకు వచ్చాడు. అయితే నితీష్ రాణా ప్రయోగం బెడిసి కొట్టింది. రాణా వేసిన తొలి ఓవర్‌లో జైశ్వాల్ ఏకంగా 26 పరుగులు రాబట్టాడు.
తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచిన జైశ్వాల్.. తరువాతి రెండు బంతులను ఫోర్లుగా, మళ్లీ ఆఖరి బంతికి ఫోరు బాదడంతో 26 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
ఇక తొలి ఓవర్ వేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన నితీష్ రాణాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. నీవు ఏమైనా నెం1 బౌలర్ అనుకున్నావా, నీ చెత్త కెప్టెన్సీకు ఓ దండం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్ షాక్.. బట్లర్‌కు భారీ జరిమానా!
The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN
— JioCinema (@JioCinema) May 11, 2023