IPL 2023, KKR Vs RR: Opener Yashasvi Jaiswal Reveals Chat With Sanju Samson After His Role In The Run Out Of Jos Buttler - Sakshi
Sakshi News home page

#Yashasvi Jaiswal: బట్లర్‌ రనౌట్‌ విషయంలో సంజూ భాయ్‌ నాకు చెప్పిందిదే; అదో గొప్ప అనుభూతి!

Published Fri, May 12 2023 10:22 AM | Last Updated on Fri, May 12 2023 10:48 AM

IPL 2023 Yashasvi Jaiswal: Sanju Bhai Said Not Think About Run Out - Sakshi

యశస్వి- సంజూ (PC: IPL/RR Twitter)

IPL 2023 KKR Vs RR: ‘‘అన్నివేళలా మనం కోరుకున్నవన్నీ జరగకపోవచ్చు. మనపై మనకు నమ్మకం ఉండటం ముఖ్యం. ఆత్మవిశ్వాసం ఉంటే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. నేను మ్యాచ్‌కు ముందు అన్ని రకాలుగా సన్నద్ధమయ్యాను. 

ఎలాగైనా జట్టును గెలిపించాలనే సంకల్పంతో ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని రాజస్తాన్‌ యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో యశస్వి అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ
ఈడెన్‌ గార్డెన్స్‌లో 13 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ మొత్తంగా 47 బంతుల్లో 98 పరుగులు రాబట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు ఉ‍న్నాయి. కెప్టెన్‌ సంజూ శాంసన్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచిన యశస్వి.. ఫోర్‌ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. 

ఈ సీజన్‌లో మరో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయిన యశస్వి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం అతడు మాట్లాడుతూ.. విన్నింగ్‌ షాట్‌ ఆడటం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు. 

రనౌట్‌ విషయంలో నాకు చెప్పిందిదే
‘‘నా బెస్ట్‌ ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేశాను. సెంచరీ మిస్‌ అయినందుకు పెద్దగా బాధ లేదు. మాకు ప్రస్తుతం రన్‌రేటు ముఖ్యం. అదే నా మైండ్‌లో ఉండిపోయింది. మ్యాచ్‌ను త్వరగా ఫినిష్‌ చేయాలని నేను సంజూ భావించాం.

మ్యాచ్‌లో రనౌట్లు సహజం. అయితే, మరోసారి ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్లర్‌ రనౌట్‌ విషయంలో సంజూ భాయ్‌ నన్నేమీ అనలేదు. కేవలం బ్యాటింగ్‌ మీద దృష్టి పెట్టమని చెప్పాడు’’ అని 21 ఏళ్ల యశస్వి జైశ్వాల్‌ తెలిపాడు.

ఐపీఎల్‌కు థాంక్స్‌
ఇక.. తన లాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ అవకాశం ఇస్తోందని.. ఇలాంటి టోర్నీలు ఉండటం నిజంగా గొప్ప విషయం అని అతడు పేర్కొన్నాడు. క్రికెటర్లుగా ఎదగాలని కలల కంటున్న యువకుల ఆశయసాధనకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా 41 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించిన రాజస్తాన్‌ రన్‌రేటు భారీగా మెరుగుపరచుకుని ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకొచ్చింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

చదవండి: నెం.1 బౌలర్‌ అనుకున్నావా.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ
గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. బట్లర్‌కు భారీ జరిమానా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement