RR vs KKR
-
IPL 2025: ఏంటి.. రియాన్ పరాగ్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా..?
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (మార్చి 26) రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. గౌహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ రాయల్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో ఘోరంగా విఫలమై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ డికాక్ 61 బంతుల్లో 97 పరుగులు చేసి ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలుపుతో విజయాల ఖాతా తెరిచింది. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.Fan breaches security to meet Riyan Parag! Cricket fever at its peak!🏃[ Video Credits: @JioHotstar, @IPL #RiyanParag #RRvsKKR ] pic.twitter.com/xzlrQW44uq— ◉‿◉ (@nandeeshbh18) March 26, 2025కాగా, చప్పగా సాగుతున్న నిన్నటి మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అమాంతం మైదానంలోకి దూసుకొచ్చి బౌలింగ్ చేస్తున్న రియాన్ పరాగ్ కాళ్లపై పడ్డాడు. ఆ తర్వాత రియాన్‌ను కౌగిలించుకున్నాడు. ఈలోపు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ పిచ్ ఇన్వేడర్ను లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.So, Riyan Parag hired a boy and paid him 10,000 Rs to come onto the ground and touch his feet.What an attention seeker this guy is!#RRvsKKR pic.twitter.com/0w7gfW7lAC— Dr Nimo Yadav 2.0 (@niiravmodi) March 26, 2025ఇది చూసి జనాలు రియాన్‌కు కూడా కాళ్లు మొక్కే ఫ్యాన్స్ ఉన్నారా అని కామెంట్లు చేస్తున్నారు. రియానే ఆ వ్యక్తికి డబ్బిచ్చి అలా చేయమని ఉంటాడని మరికొందరంటున్నారు. రియాన్ కాళ్లు మొక్కి జైలుకి (మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వస్తే జరిమానా, జైలు శిక్ష లేదా స్టేడియం నుంచి బహిష్కరణ లాంటి శిక్షలు వేస్తారు) వెళ్లే సాహసం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరేమో రియాన్ లోకల్ హీరో కాబట్టి ఫ్యాన్స్ ఉండటంలో తప్పేముందని అంటున్నారు. రియాన్ రాయల్స్‌కు కెప్టెన్ కూడా అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్లు వస్తున్నా.. రియాన్ రాయల్స్‌కు స్టార్ ఆటగాడు. పైగా అతను జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రియాన్ పుట్టి పెరిగింది కూడా నిన్న మ్యాచ్ జరిగిన గౌహతిలోనే. జాతీయ స్థాయిలో, ఐపీఎల్లో ఆ రాష్ట్రానికి (అసోం) ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడు అతనే. అలాంటప్పుడు అతనికి ఫ్యాన్స్ ఉంటే తప్పేముంది. సోషల్‌మీడియా యూజర్స్‌కు నచ్చినా నచ్చకపోయినా రియాన్ ఓ స్టార్ ఆల్‌రౌండర్. అతనిలో ఎంత టాలెంట్ లేకుంటే అతన్ని రాయల్స్ గత సీజన్‌కు ముందు రిటైన్ చేసుకుంటుంది..? అంత మంది సీనియర్లు ఉన్నా అతన్నే ఎందుకు కెప్టెన్ చేస్తుంది..?No way you risk getting fined, jailed or probably banned from the stadium to touch Riyan Parag's feet? 😭 pic.twitter.com/lPKgS9dJEB— Heisenberg ☢ (@internetumpire) March 26, 2025 -
‘అతడిని ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?.. ఇలాంటి వింత చూడలేదు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో రాజస్తాన్ రాయల్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. తమ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన పింక్ జట్టు.. రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. రాజస్తాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీరును విమర్శించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పుల వల్లే రాయల్స్‌కు భంగపాటు ఎదురైందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో ప్యూర్ బ్యాటర్‌ను ఎనిమిదో స్థానంలో పంపే ఏకైక జట్టు రాయల్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్ఈ మేరకు.. ‘‘కోల్‌కతాతో మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటింగ్ ఆర్డరే ఓ డిజార్డర్. మీరు తొలుత బ్యాటింగ్ చేయాల్సి ఉంది. కానీ గత మ్యాచ్‌లో 11 లేదా 12 బంతుల్లోనే 35 పరుగులు సాధించిన బ్యాటర్ శుభమ్ దూబేకు.. మీరు తుదిజట్టులో స్థానం ఇవ్వలేదు.ఆల్‌రౌండర్ వనిందు హసరంగను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించారు. అతడు పట్టుమని పది పరుగులు చేయకుండా అవుటయ్యాడు. ఆ తర్వాతైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. శుభమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించారు.పవర్ హిట్టర్ షిమ్రన్ హెట్‌మెయిర్‌ను కాదని శుభమ్‌ను ఏడో స్థానంలో పంపించారు. అతడు విఫలమయ్యాడు. మరోవైపు.. ఎనిమిదో స్థానంలో వచ్చిన హెట్మెయిర్ కూడా చేతులెత్తేశాడు.ఇలాంటి వింత చూడలేదుస్పెషలిస్టు బ్యాటర్.. అదీ టీ20 క్రికెట్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడం ప్రపంచంలో ఎక్కడైనా చూశారా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఏమని స్పందించాలో కూడా తెలియడం లేదు. వాళ్ల వింత నిర్ణయాలు ఎవరికీ అంతుపట్టడం లేదు’’ అని ఆకాశ్ చోప్రా రాజస్తాన్ నాయకత్వ బృందంపై ఘాటు విమర్శలు చేశాడు.కాగా రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయం వల్ల గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2025తో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆరంభ మ్యాచ్‌లలో సారథ్య బాధ్యతలకు అతడు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.బ్యాటర్ల వైఫల్యంపరాగ్ నాయకత్వంలో తొలుత రైజర్స్చేతిలో ఓడిన రాయల్స్.. రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది. గువాహతి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (29), సంజూ శాంసన్ (13) నిరాశపరచగా.. పరాగ్ (15 బంతుల్లో 25) కాసేపు అలరించాడు.ఇక, నితీశ్ రాణా(8) పూర్తిగా విఫలం కాగా... రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన హసరంగ ఐదో స్థానంలో వచ్చి 4 పరుగులకే నిష్క్రమించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 33) నిలదొక్కుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు.అయితే, గత మ్యాచ్‌లో అదరగొట్టిన శుభమ్ దూబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటివ్వని రాయల్స్.. ఇంపాక్ట్ప్లేయర్గా ఏడో స్థానంలో ఆడించింది. అతడు 12 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు.. హెట్మెయిర్ 8 బంతుల్లో 7 రన్స్ చేయగా.. ఆఖర్లో టెయిలెండర్ జోఫ్రా ఆర్చర్ (7 బంతుల్లో 16) కాస్త వేగంగా ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో రాజస్తాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది.డికాక్ వన్‌మ్యాన్ షోఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ అదరగొట్టింది. ఆరంభంలోనే ఓపెనర్ మొయిన్ అలీ(5) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ దుమ్ములేపాడు. 61 బంతుల్లో 97 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. Q for Quality, Q for Quinton 👌👌A sensational unbeaten 9⃣7⃣ runs to seal the deal ✅Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/kbjY1vbjNL— IndianPremierLeague (@IPL) March 26, 2025మిగతా వాళ్లలో కెప్టెన్ అజింక్య రహానే 18, అంగ్క్రిష్ రఘువన్షీ 22 (నాటౌట్) పరుగులు సాధించారు. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసిన కేకేఆర్.. ఈ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. అంతకు ముందు కోల్‌కతా.. ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. చదవండి: శ్రేయస్ కాదు!.. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశ్విన్ -
RR VS KKR: అంతా డికాకే చేశాడు.. తప్పులు ఒప్పుకుంటాం.. రిపీట్ చేయం: రియాన్ పరాగ్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘెర పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ అతి కష్టం మీద 151 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగలిగింది. బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కేకేఆర్ బౌలర్లు చెలరేగిపోయారు. మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేసి రాయల్స్ బ్యాటర్లను కట్టడి చేశారు.రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా నిలువగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో ఆర్చర్ 2 సిక్సర్లు బాదడంతో రాయల్స్ 150 పరుగుల మార్కును తాకగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ను క్వింటన్ డికాక్ ఒంటిచేత్తో గెలిపించాడు. డికాక్ 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్) చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. డికాక్ మరో ఎండ్ నుంచి రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారం తీసుకుని మ్యాచ్‌ను ముగించాడు. డికాక్ రెచ్చిపోవడంతో మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు రాయల్స్ ఏ ఒక్క అవకాశం రాలేదు. డికాక్ బాధ్యతాయుతంగా ఆడి రాయల్స్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. రాయల్స్ కెప్టెన్ ఏడుగురు బౌలర్లను ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్కరు కూడా డికాక్‌ను కంట్రోల్ చేయలేకపోయారు.వాస్తవానికి రాయల్స్ బ్యాటింగ్ చేసే సమయంలోనే మ్యాచ్‌ను కోల్పోయింది. ఆ జట్టు కనీసం 170-180 పరుగులు చేసుండాల్సింది. కేకేఆర్ బౌలర్లలో మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేశారు. కేకేఆర్ గెలుపుకు వీరు ఆదిలోనే బీజం వేశారు.మ్యాచ్ అనంతరం లూజింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 170 పరుగులు స్కోర్ చేసుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. వ్యక్తిగతంగా నాకు ఈ వికెట్ (గౌహతి పిచ్) గురించి తెలుసు కాబట్టి కాస్త తొందరపడ్డాను. వేగంగా పరుగులు సాధించే క్రమంలో నేను చేయాల్సిన దాని కంటే 20 పరుగులు తక్కువ చేశాను. నేను అదనంగా 20 పరుగులు చేసుంటే బౌలర్లకు ఫైటింగ్ చేసే అవకాశం ఉండేది.డికాక్ అద్భుతంగా ఆడాడు. అతన్ని త్వరగా ఔట్ చేయాలన్నదే మా ప్రణాళిక. కానీ అది జరగలేదు. మిడిల్ ఓవర్లలోనైనా మ్యాచ్‌ను మా నియంత్రణలోకి తెచ్చుకుందామనుకున్నాము. అదీ జరగలేదు. డికాక్ మాకు ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ఒంటిచేత్తో మ్యాచ్నులాగేసుకున్నాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడంపై స్పందిస్తూ.. గత సీజన్లో జట్టు నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని కోరింది. అలాగే చేశాను. ఈ సీజన్లో మేనేజ్మెంట్ నన్ను 3వ స్థానంలో బ్యాటింగ్ చేయమంది. జట్టు అవసరాల కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా నేను సిద్దంగా ఉండాలి.గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో మాకు యువ జట్టు ఉంది. మేము చిన్న దశల్లో బాగా రాణిస్తున్నాము. దీన్నే మ్యాచ్ మొత్తంలో కొనసాగిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయి. ఈ పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాము. మా తప్పులను ఒప్పుకుంటాము. వాటిని మళ్ళీ పునరావృతం చేయకుండా చూసుకుంటాము. కొత్త ఆలోచనలతో చెన్నైతో మ్యాచ్‌లో బరిలో నిలుస్తాము.కాగా, రియాన్ సారథ్యంలో రాయల్స్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో రియాన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రియాన్‌ను ఇంకో అవకాశం ఉంది. నాలుగో మ్యాచ్ నుంచి శాంసన్ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడు. రాయల్స్ మార్చి 30న ఇదే గౌహతిలో సీఎస్కేతో తలపడనుంది. -
RR VS KKR: మొయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. క్రెడిట్ బౌలర్లకే దక్కుతుంది: రహానే
ధనాధన్ బ్యాటింగ్ విన్యాసాలతో తొలి ఐదు రోజులు జోరుగా సాగిన ఐపీఎల్ 2025 ఆరో రోజు చప్పబడింది. గౌహతి వేదికగా కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న (మార్చి 26) జరిగిన మ్యాచ్ పేలగా సాగింది. ఛేదనలో కేకేఆర్ ఓపెనర్ డికాక్ (61 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడినా మ్యాచ్‌లో అంత మజా రాలేదు. మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు బోర్ ఫీలయ్యారు. మ్యాచ్ ఇంత చప్పగా సాగడానికి పిచ్‌తో పాటు గౌహతిలో వాతావరణం కారణం. పిచ్ నుండి బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపింది. మొత్తంగా రాయల్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ సునాయాసంగా ఛేదించింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. కేకేఆర్ బౌలర్లు రెచ్చిపోవడంతో అతి కష్టం మీద 151 పరుగులు చేసింది (9 వికెట్ల నష్టానికి). మొయిన్ అలీ (4-0-23-2), వరుణ్ చక్రవర్తి (4-0-17-2), హర్షిత్ రాణా (4-0-36-2), వైభవ్ అరోరా (4-0-33-2) రాయల్స్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. స్పిన్నర్లు మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి ఆదిలోనే వికెట్లు తీసి రాయల్స్‌పై ఒత్తిడి తెచ్చారు. ఓ దశలో రాయల్స్ కనీసం 120 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎలాగో ముక్కిమూలిగి చివరికి 150 పరుగుల మార్కును తాకగలిగింది. రాయల్స్ బ్యాటర్లలో ధృవ్ జురెల్ (33) టాప్ స్కోరర్‌గా కాగా.. జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 25, సంజూ శాంసన్ 13, జోఫ్రా ఆర్చర్ 16 పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవర్ ప్లేలో ఆ జట్టు 41 పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్‌గా వచ్చిన మొయిన్ అలీ (12 బంతుల్లో 5) వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ డికాక్ బాధ్యతాయుతంగా ఆడి, కెప్టెన్ రహానే (18), రఘువంశీ (22 నాటౌట్) సహకారంతో కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. కేకేఆర్ మరో 15 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో (కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా) మంచు ప్రభావం కారణంగా రాయల్స్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆ జట్టు తరఫున హసరంగ ఒక్కడే వికెట్ (రహానే) తీయగలిగాడు. మొయిన్ అలీ రనౌటయ్యాడు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో మేము బాగా బౌలింగ్ చేసాము. మిడిల్ ఓవర్లు కూడా కీలకమైనవే. స్పిన్నర్లు పరిస్థితులను నియంత్రించిన విధానం బాగుంది. మొయిన్ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఆటగాళ్లు నిర్భయంగా ఆడాలని కోరుకునే ఫార్మాట్ ఇది. వారికి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాము.క్రెడిట్ మా బౌలింగ్ యూనిట్‌కు దక్కుతుంది. వారు ప్రతి బంతికి వికెట్ తీయాలనే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొయిన్. మొయిన్ ఓ నాణ్యమైన ఆల్‌రౌండర్. గతంలో కూడా అతను ఓపెనింగ్ చేశాడు. బ్యాట్‌తో అతను ఆశించిన సఫలత సాధించలేకపోయినా.. బంతితో రాణించిన విధానం పట్ల సంతోషంగా ఉంది. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో భంగపడ్డ విషయం తెలిసిందే. కేకేఆర్ నెక్స్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొటుంది. ఈ మ్యాచ్ మార్చి 31న వాంఖడేలో జరుగనుంది. -
4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) -2025లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో ఆదివారం నాటి మ్యాచ్‌లో రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాజస్తాన్ బౌలింగ్‌ను రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. రాయల్స్ బౌలర్లకు పీడకల మిగిల్చారు.ఫలితంగా ఆ జట్టు ఏకంగా 286 పరుగులు సాధించింది. అయితే, లక్ష్య ఛేదనలో రాయల్స్ 242 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఇక తమ రెండో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగువాహతి వేదికగా బుధవారం కేకేఆర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్‌లో కోల్‌కతా (ఆర్సీబీ చేతిలో) కూడా ఓడిపోవడంతో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ల వైఫల్యం కొనసాగితే మాత్రం ఆ జట్టుకు మరో ఓటమి తప్పదని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా విదేశీ పేసర్లు జోఫ్రా ఆర్చర్, ఫజల్హక్ ఫారూకీలను తుదిజట్టులో కొనసాగించే అంశంపై యాజమాన్యం తీసుకునే నిర్ణయమే కీలకం కానుందని పేర్కొన్నాడు.4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?‘‘బౌలింగ్ విభాగంలో రాజస్తాన్ రాయల్స్‌కు ఆందోళన తప్పదు. ముఖ్యంగా జోఫ్రాపైనే ప్రస్తుతం అందరూ దృష్టి పెట్టారు. నిజానికి రాయల్స్ జట్టులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. మిగతా జట్లలో ఎనిమిది మంది ఉన్నారు. అయితే, తమకున్న ఆరుగురిలో రాజస్తాన్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను కలిగి ఉంది.వాళ్లు గత మ్యాచ్‌లో ఆడారు. ఒకరేమో (జోఫ్రా) నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇచ్చి ఐపీఎల్ చరిత్రలోనే నాసిరకమైన స్పెల్‌తో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మరొకరు ఫజల్హక్ ఫారూకీ.. జోఫ్రాతో పాటు అతడి బౌలింగ్‌నూ ప్రత్యర్థి బ్యాటర్లు చితక్కొట్టారు.ప్రతి బౌలర్ కెరీర్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి చేదు అనుభవం ఉండటం సహజమే. అయితే, జట్టులో ఉన్న ఇద్దరు విదేశీ బౌలర్లు ఇలా ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటే ఏం చేయాలన్న అంశంపై యాజమాన్యానికి స్పష్టత కొరవడుతుంది. వాళ్లిద్దరిలో ఒకరిపై వేటు వేస్తేనే బెటర్.మఫాకాను ఆడించండిసౌతాఫ్రికా యువ బౌలర్ క్వెనా మఫాకాను జోఫ్రా లేదంటే ఫారూకీ స్థానంలో ఆడించండి. అయినా సరే.. రాజస్తాన్ బౌలింగ్ విభాగం కచ్చితంగా రాణిస్తుందని చెప్పలేం’’ అని ఆకాశ్ చోప్రా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇక రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ గురించి ప్రస్తావిస్తూ.. ఈసారి అతడు ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) సాధిస్తాడని అంచనా వేశాడు.‘‘రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఇద్దరు యువ ఆటగాళ్లు నా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకరేమో కెప్టెన్ రియాన్ పరాగ్. మరొకరు యశస్వి జైస్వాల్. ఈసారి జైసూ ఆరెంజ్ క్యాప్ గెలుపొందినా ఆశ్చర్యం లేదు. గత సీజన్లో అతడి ఫామ్ బాగాలేదు. అయినంత మాత్రాన ప్రతిసారి అలాగే ఉంటుందని భావించలేము’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.కాగా గత మ్యాచ్‌లో జైస్వాల్ ఐదు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. మరోవైపు జోఫ్రా నాలుగు ఓవర్లలో ఏకంగా 76 పరుగులు ఇవ్వగా.. ఫారూకీ మూడు ఓవర్లు పూర్తి చేసి 49 రన్స్ సమర్పించుకున్నాడు. మహీశ్ తీక్షణ(2/52), సందీప్ శర్మ 2/51) పరుగులు ఇచ్చినా రెండేసి వికెట్లు తీయగలిగారు.చదవండి: ఇదేం కెప్టెన్సీ గిల్? ఏమీ పట్టనట్టే ఉన్నావు ఎందుకు?: సెహ్వాగ్