వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 136 పరుగులకు ఆలౌట్ అయింది.
మారిజన్నే కాప్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, కిమ్ గార్త్, హర్లిన్ డియోల్, స్నేహ్‌రాణా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్‌లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment