హారిస్ సంచలన ఇన్నింగ్స్‌.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్‌ విజయం | WPL 2023: Gujarat Giants Vs UP Warriorz Match Live Updates | Sakshi
Sakshi News home page

WPL 2023: హారిస్ సంచలన ఇన్నింగ్స్‌.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్‌ విజయం

Published Sun, Mar 5 2023 7:05 PM | Last Updated on Mon, Mar 6 2023 1:04 AM

WPL 2023: Gujarat Giants Vs UP Warriorz Match Live Updates - Sakshi

హారిస్ సంచలన ఇన్నింగ్స్‌.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్‌ విజయం
మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో యూపీ వారియర్జ్‌ శుభారంబం చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో యూపీ విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో యూపీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు బ్యాటర్‌ గ్రేస్‌ హారిస్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. 

ఆఖరి ఓవర్ వేసిన సదర్లాండ్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను హారిస్‌ ఫినిష్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు ఎదుర్కొన్న హారిస్‌ 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది.  ఆమెతో పాటు కిరణ్ నవ్‌గిరే(53)పరుగులతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గుజరాత్‌ బౌలర్లలో కిమ్‌ గార్త్‌ ఐదు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. గార్త్‌ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. 

18 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్‌(36), ఎకిలిస్టోన్‌(9) పరుగులతో ఉన్నారు. యూపీ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాలి.

17 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్‌(23), ఎకిలిస్టోన్‌(3) పరుగులతో ఉన్నారు.

ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్
వరుస క్రమంలో యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో హ్యారిస్‌, వైద్యా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు  గుజరాత్‌ పేసర్‌ కిమ్ గార్త్ ఐదు వికెట్లు పడగొట్టింది.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. గుజరాత్‌ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్‌(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్‌,శర్వాణి తలా వికెట్‌ సాధించారు.

9 ఓవర్లకు యూపీ స్కోర్‌: 60/3
9 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కిరణ్ నవ్‌గిరే(40), దీప్తి శర్మ(8) పరుగులతో ఉన్నారు.

26 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో యూపీ
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ హీలీతో పాటు శ్వేతా సెహ్రావత్, మెక్‌గ్రాత్‌ వికెట్లను యూపీ కోల్పోయింది. కాగా తొలి మూడు వికెట్లను కూడా గుజరాత్‌ పేసర్‌ కిమ్ గార్త్ పడగొట్టింది.

రాణించిన గుజరాత్‌ బ్యాటర్లు.. యూపీ టార్గెట్‌ 170 పరుగులు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. గుజరాత్‌ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్‌(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్‌,శర్వాణి తలా వికెట్‌ సాధించారు.

16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జెయింట్స్‌ 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), హేమలత (1)పరుగులతో ఉన్నారు.

14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జెయింట్స్‌ 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), గార్డనర్‌(18) పరుగులతో ఉన్నారు.

9 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 58/3
9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్‌, సుష్మా వర్మ పరుగులతో ఉన్నారు.

38 పరుగుల వద్ద  గుజరాత్‌ జెయింట్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మేఘన.. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో పెవియలన్‌కు చేరింది.

34 పరుగుల వద్ద  గుజరాత్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డాంక్లీ.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యంది. క్రీజులో హర్లీన్‌ వచ్చింది.

3 ఓవర్లకు గుజరాత్‌ స్కోర్‌: 30/0
3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో సబ్బినేని మేఘన(20), డాంక్లీ(10) పరుగులతో ఉన్నారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌లో డివై పాటిల్‌ స్టేడియం వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌తో తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ బెత్‌ మూనీ గాయం కారణంగా దూరమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టుకు స్నేహ్ రానా సారథ్యం వహించనుంది.

తుది జట్లు:
యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్‌), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్

గుజరాత్ జెయింట్స్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్‌కీపర్‌), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(కెప్టెన్‌), తనుజా కన్వర్, మాన్సీ జోషి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement