మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్/వికెట్‌కీపర్ బెత్ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్ మొత్తానికే దూరమైంది.
దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్ట్‌తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్ మూనీని బేస్ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న వొల్వార్ట్.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం.
ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్ జెయింట్స్ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ లక్ష్మీ యాదవ్ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్ యాజమాన్యం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది.
మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది..
Comments
Please login to add a commentAdd a comment