
ఐదు వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపు
రాణించిన హేలీ, నాట్‌సివర్
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో పోరులో విజయాన్ని అందుకొని పాయింట్ల ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)పై ఘన విజయం సాధించింది. గుజరాత్‌కు ఈ టోర్నిలో ఇది రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.
హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే కొద్దిగా ప్రభావం చూపగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (3/16) రాణించగా...అమెలియా కెర్, నాట్ సివర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. నాట్ సివర్ బ్రంట్ (39 బంతుల్లో 57; 11 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ జట్టు తలపడుతుంది.
స్కోరు వివరాలు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సంస్కృతి గుప్తా (బి) నాట్ సివర్ 1; వోల్‌వార్ట్ (సి) సజన (బి) షబ్నమ్ 4; హేమలత (సి) కెర్ (బి) హేలీ 9; ఆష్లీ గార్డ్‌నర్ (సి) సంజన (బి) నాట్ సివర్ 10; హర్లీన్ (సి) హేలీ (బి) కౌర్ 32; డాటిన్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 7; కాశ్వీ (సి) భాటియా (బి) హేలీ 20; సిమ్రన్ (సి) కెర్ (బి) హేలీ 3; తనూజ (సి) సంస్కృతి గుప్తా (బి) కెర్ 13; సయాలీ (నాటౌట్) 13; ప్రియ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–6, 2–14, 3–16, 4–28, 5–43, 6–67, 7–79, 8–103, 9–103, 10–120.

బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–1–17–1, నాట్ సివర్ 4–0–26–2, హేలీ మాథ్యూస్ 4–0–16–3, అమేలియా కెర్ 4–0–22–2, పరుణిక 2–0–20–0, అమన్‌జోత్ కౌర్ 2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) హర్లీన్ (బి) తనూజ కన్వర్ 17; యస్తిక (సి) వోల్‌వార్ట్ (బి) ప్రియ 8; నాట్ సివర్ (బి) ప్రియ 57; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) కాశ్వీ 4; కెర్ (ఎల్బీ) (బి) కాశ్వీ 19; సజన (నాటౌట్) 10; కమలిని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–55, 4–100, 5–114. బౌలింగ్: ఆష్లీ గార్డ్‌నర్ 3–0–21–0, తనూజ 3–0–25–1, డియాండ్ర డాటిన్ 3.1–0–19–0, ప్రియ మిశ్రా 4–0–40–2, కాశ్వీ గౌతమ్ 3–0–15–2.
Comments
Please login to add a commentAdd a comment