
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి షమీ తొలి ఓవర్‌లో వార్నర్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ నక్క తోక తొక్కినట్లున్నాడు. ఓవర్ తొలి బంతిని వైడ్ వేసిన షమీ ఆ తర్వాత బంతిని మాత్రం అద్బుతంగా వేశాడు.
మిడిల్ స్టంప్ అయిన బంతి ఆఫ్‌స్టంప్‌ను తాకుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. కానీ బెయిల్స్ ఇంచు కూడా కదల్లేదు. దీంతో వార్నర్ బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత వార్నర్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
— Guess Karo (@KuchNahiUkhada) April 4, 2023