
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు శుభారంభం చేసింది. గచ్చిచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ జెయింట్స్‌లో ప్రతీక్ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు.
మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 39–34తో బెంగాల్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది. జైపూర్ జట్టు తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. 12 రెయిడింగ్ పాయింట్లతో సూపర్–10 ఖాతాలో వేసుకున్న అర్జున్ జట్టుకు కీలక సమయాల్లో ఆధిక్యం అందించాడు.
అభిజిత్ మలిక్ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున అత్యధికంగా నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. మణీందర్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8:00 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటల నుంచి) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment