![WPL 2024: Mumbai Indians Bowlers Restricted Gujarat Giants For 127 Runs - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/25/Untitled-11.jpg.webp?itok=CvOM6CmQ)
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది.
ముంబై బౌలర్లు అమేలియా కెర్ (4-0-17-4), షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-18-3) అద్భుత ప్రదర్శనలతో గుజరాత్ పతనాన్ని శాశించారు. నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. అమేలియా కెర్ ఆఖర్ ఓవర్‌లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది.
తనుజా కన్వర్ (28) ఆఖర్లో బ్యాట్ ఝులిపించకపోయుంటే గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కేథరీన్ బ్రైస్ (25 నాటౌట్), కెప్టెన్ బెత్ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్ డియోల్ (8), లిచ్‌ఫీల్డ్ (7), దయాలన్ హేమలత (3), ఆష్లే గార్డ్‌నర్ (15), స్నేహ్ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు.
ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది.
Comments
Please login to add a commentAdd a comment