గుజరాత్ జెయింట్స్‌కు దారుణ పరాభవం
►డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దయాలన్ హేమలత 29 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైకా ఇషికీ నాలుగు వికెట్లతో చెలరేగింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్‌హమ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
► గుజరాత్ జెయింట్స్ ఫేలవ ఆటతీరు కనబరుస్తుంది. మాన్సి జోషి(6) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్
► గుజరాత్ జెయింట్స్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. వర్హెమ్ 4, దయాలన్ హేమలత ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్
► 208 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత కెప్టెన్ బెత్ మూనీ కాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్ వాంగ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. మరుసటి బంతికే స్టార్ బ్యాటర్ అష్లీ గార్డనర్ గోల్డెన్ డకౌట్ అయింది. సబ్బినేని మేఘన రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
హర్మన్, అమెలీ కైర్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు
► డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్‌హమ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ముగిసిన హర్మన్ జోరు.. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
► కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హర్మన్(30 బంతుల్లో 65) స్నేహ్‌రాణా బౌలింగ్‌లో హేమలతాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.
హర్మన్‌ప్రీత్ మెరుపులు.. భారీ స్కోరు దిశగా ముంబై
► ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీల వర్షం కురిపిస్తోంది. తద్వారా ముంబై భారీ స్కోరు దిశగా కదులుతుంది. 15 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులతో హర్మన్ దూకుడు ఆటతీరును కనబరుస్తోంది. ప్రస్తుతం ముంబై 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
► దూకుడుగా ఆడిన హేలీ మాథ్యూస్ 47 పరుగుల వద్ద గార్డనర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న విండీస్ క్రికెటర్
► విండీస్ క్రికెటర్ హెలీ మాథ్యూస్ సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ముంబై 8.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మాథ్యూస్ 41 పరుగులతో క్రీజులో ఉంది. సివర్ బ్రంట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
► ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్ నష్టానికి 44 పరుగులుగా ఉంది. సివర్ బ్రంట్ 189, మాథ్యూ హెలిస్సా 23 పరుగులతో ఆడుతున్నారు.
► 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు ఎంతంటే?
4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వుమెన్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 15, నట్ సివర్ బ్రంట్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు యస్తికా బాటియా(1) తనూజ కన్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది.
► టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న గుజరాత్ జెయింట్స్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం మ్యాచ్‌కు వేదిక కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఏంచుకుంది.గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.
ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి
► అంతకముందు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సింగర్ డిల్లాన్‌లు తమ ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment