ఆర్సీబీతో మ్యాచ్‌.. విధ్వంసం సృష్టించిన గుజరాత్‌ ఓపెనర్లు | WPL 2024: Gujarat Giants Scored 199 For 5 Against RCB | Sakshi
Sakshi News home page

ఆర్సీబీతో మ్యాచ్‌.. విధ్వంసం సృష్టించిన గుజరాత్‌ ఓపెనర్లు

Published Wed, Mar 6 2024 9:20 PM | Last Updated on Thu, Mar 7 2024 9:16 AM

WPL 2024: Gujarat Giants Scored 199 For 5 Against RCB - Sakshi

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇవాళ (మార్చి 6) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్లు లారా వొల్వార్డ్ట్‌, బెత్‌ మూనీ శివాలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. లారా, మూనీ రెచ్చిపోవడంతో భారీ స్కోర్‌ చేసింది. లారా 45 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేయగా.. మూనీ 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

ఫలితంగా గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లారా, మూనీ మినహా గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 18, ఆష్లే గార్డ్‌నర్‌ 0, దయాలన్‌ హేమలత 1, వేద కృష్ణమూర్తి ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్‌ సోఫీ మోలినెక్స్‌ ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో గుజరాత్‌ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది.

మోలినెక్స్‌ ఆఖరి ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీసింది. ఒకరు రనౌటయ్యారు. 18వ ఓవర్‌ వరకు (187/1) అతి భారీ స్కోర్‌ దిశగా సాగుతున్నట్లు కనిపించిన గుజరాత్‌ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్‌, జార్జియా వేర్హమ్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. ముగ్గురు బ్యాటర్లు రనౌట్లయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement