
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ దూసుకుపోతుంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ముంబై బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
హర్లిన్ డియోల్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్నేహ్‌రాణా 20 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో నట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ 2 వికెట్లు పడగొట్టింది.అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్‌నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్‌రాణా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment