వుమెన్స్ ప్రీమియర్ లీగ్ భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ పోరాడే స్కోరు సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔటయ్యాక వెంటనే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో 136 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ పడింది.
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవర్‌లో అష్లీ గార్డ్‌నర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వరుస బంతుల్లో హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్ కౌర్‌లను ఔట్ చేసింది. కానీ, ఆఖరి బంతికి జింతిమని కతియా రెండు రన్స్ తీసింది. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్‌నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment