మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ లీగ్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్ జట్లకు ఊహించని షాక్‌లు తగిలాయి.
ఆర్సీబీ ఆల్ రౌండర్ కనిక అహుజా, గుజరాత్ జెయింట్స్ పేసర్ కాశ్వీ గౌతమ్‌లు డబ్ల్యూపీఎల్-2024 సీజన్ నుంచి తప్పుకున్నారు. గాయాల కారణంగా వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో కనిక స్ధానాన్ని లెఫ్టార్మ్ పేసర్ శ్రద్ధా పోఖర్కర్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. శ్రద్ధాకు దేశీవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది.
ఆమె రూ. 10 లక్షల కనీస ధరతో ఆర్సీబీలో చేరనుంది. మరోవైపు కాశ్వీ గౌతమ్ స్ధానాన్ని సయాలీ సతగరెతో గుజరాత్ జెయింట్స్ భర్తీ చేసింది. సయాలీతో రూ.10 లక్షల కనీస ధరకు గుజరాత్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డబ్ల్యూపీఎల్-2024 వేలంలో కాశ్వీని రూ.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment