మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 తుది సమరానికి సమయం అసన్నమైంది. ఆదివారం(మార్చి17) ఢిల్లీ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. ఇరు జట్లు కూడా ఎలాగైనా గెలిచి తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఢిల్లీకి ఇది రెండో ఫైనల్ కాగా.. ఆర్సీబీ మాత్రం తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబాలలపై ఓ లూక్కేద్దం.
ఢిల్లీ క్యాపిటల్స్..
గతేడాది అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఈ ఏడాది సీజన్‌లో సైతం అదే జోరుతో తుది పోరుకు అర్హత సాధించింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. మిగితా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా చాలా పటిష్టంగా ఉంది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్, క్యాప్సీ వంటి వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. షెఫాలీ, లానింగ్ ఇద్దరూ తమ జట్టుకు ప్రతీ మ్యాచ్‌లోనూ తొలి వికెట్‌కు అద్బుతమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు.
ఆ తర్వాత మిడిలార్డర్‌లో రోడ్రిగ్స్ కీలక ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతోంది. వీరితో పాటు క్యాప్సీ కూడా మెరుగ్గా రాణిస్తోంది. వీరు నలుగురు చెలరేగితే ఆర్సీబీకి కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. మారిజాన్ కాప్, జెస్ జోనాస్సెన్ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. కాప్ పవర్‌ప్లేలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్లను దెబ్బతీస్తోంది. జోనాస్సెన్ సైతం తన స్పిన్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పులు పెడుతోంది. వీరిద్దికి తోడు రాధా యాదవ్ తనదైన రోజున బ్యాటర్లకు చుక్కలు చూపించగలదు.
ఆర్సీబీ..
ఈ ఏడాది సీజన్‌లో ఆరంభంలో ఆర్సీబీ జట్టు కాస్త తడబడిన తర్వాత మాత్రం అద్బుతంగా పుంజుకుంది. వరుసగా ముంబై వంటి పటిష్ట జట్టును మట్టికరిపించి ఫైనల్లో ఆర్సీబీ అడుగుపెట్టింది. ఆర్సీబీ ఆల్‌రౌండర్ పెర్రీ సూపర్ ఫామ్‌లో ఉంది. బ్యాట్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొడుతోంది. ఆర్సీబీ ఫైనల్ చేరడంలో పెర్రీది కీలక పాత్ర.
ఎలిమినిటర్‌లో ముంబైపై 66 పరుగులతో పాటు ఓ కీలక వికెట్ పడగొట్టింది. ఈ నేపథ్యంలో మరోసారి ఆమెపైనే ఆర్సీబీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన కెప్టెన్ స్మృతి మంధాన.. తర్వాత మ్యాచ్‌ల్లో మాత్రం తేలిపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సైతం మంధాన విఫలమైంది.
కనీసం ఫైనల్లొనైనా మంధాన చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బౌలింగ్‌లో అయితే శ్రేయంక పాటిల్, ఆశ వంటి భారత బౌలర్లు ఉన్నారు. ఏదమైనప్పటికి ఢిల్లీని ఢీకొట్టాలంటే ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించాలి.
Comments
Please login to add a commentAdd a comment