బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట గుజరాత్ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
తనూజ (21 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు), క్యాథ్రిన్ బ్రిస్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ముంబై బౌలర్లు అమెలియా కెర్ (4/17), షబ్నమ్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్లు యస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) నిరాశపరచగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. హర్మన్, అమెలియా కెర్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ 2, బ్రిస్, లి తహుహు చెరో వికెట్ తీశారు. నేడు జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment