టాప్‌లో ముంబై, ఢిల్లీ.. మూడో స్థానంలో నైట్‌రైడర్స్‌..! | Franchises Based In Mumbai And Delhi Have An Equal And The Highest Number Of Teams Across The Globe | Sakshi
Sakshi News home page

టాప్‌లో ముంబై, ఢిల్లీ.. మూడో స్థానంలో నైట్‌రైడర్స్‌..!

Published Sun, Mar 17 2024 6:10 PM | Last Updated on Sun, Mar 17 2024 8:03 PM

Franchises Based In Mumbai And Delhi Have An Equal And The Highest Number Of Teams Across The Globe - Sakshi

ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రికెట్‌ లీగ్‌ల్లో ఐపీఎల్‌ ఫ్రాంచైజీల హవా కొనసాగుతుంది. విశ్వవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో జరిగే వివిధ లీగ్‌ల్లో ముంబై, ఢిల్లీ నగరాల ప్రాంచైజీలే అధికంగా ఉన్నాయి. 

ముంబై, ఢిల్లీ నగరాధారిత ఫ్రాంచైజీలకు దేశవ్యాప్తంగా ఐదు జట్లు ఉండగా.. కోల్‌కతా నగరాధారిత ఫ్రాంచైజీకి నాలుగు.. చెన్నై, రాజస్థాన్‌ ఫ్రాంచైజీలకు మూడు.. హైదరాబాద్‌, లక్నో, పంజాబ్‌ నగరాల ఆధారిత ఫ్రాంచైజీలకు తలో రెండ్రెండు జట్లు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్‌.. 

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ 
  • భారత్‌లోనే జరిగే మహిళల ఐపీఎల్‌లో (డబ్ల్యూపీఎల్‌) ముంబై ఇండియన్స్‌ వుమెన్స్‌ టీమ్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌
  • యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ ఎమిరేట్స్‌
  • యూఎస్‌ఏ వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌
  • భారత్‌లోనే జరిగే మహిళల ఐపీఎల్‌లో (డబ్ల్యూపీఎల్‌) ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్స్‌ టీమ్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌
  • యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో దుబాయ్‌ క్యాపిటల్స్‌
  • యూఎస్‌ఏ వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో సియాటిల్‌ ఆర్కాస్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. 

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌
  • యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్‌
  • యూఎస్‌ఏ వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో లాస్‌ ఎంజెలెస్‌ నైట్‌రైడర్స్‌
  • కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌
  • యూఎస్‌ఏ వేదికగా జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌
  • కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌
  • సౌతాఫ్రికా వేదికగా జరిగే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌

పంజాబ్‌ కింగ్స్‌..

  • భారత్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌
  • కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement