
డబ్ల్యూపీఎల్ 2025 ఎడిషన్‌లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఎల్లిస్ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది.
ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ 4, రిచా ఘోష్ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్ (22), జార్జియా వేర్హమ్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్ గార్త్ (14) రెండంకెల స్కోర్ చేసింది. స్నేహ్ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్ (4-0-17-1), తనూజా కన్వర్ (4-0-16-2), కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.
కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్‌లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment