గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ జట్టు ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన తలైవాస్ 40–27 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మోయిన్ షఫాఘి 13 పాయింట్లతో సత్తా చాటగా... సౌరభ్, హిమాన్షు చెరో 7 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది.
తాజా సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన తమిళ్ తలైవాస్ 6 విజయాలు, 9 పరాజయాలు, ఒక ‘టై’తో 38 పాయింట్లు సంపాదించింది. ప్రస్తుతం తలైవాస్ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ 16 మ్యాచ్‌ల్లో పదో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారమే జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 42–36 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. హరియాణా జట్టు తరఫున శివమ్ 11 పాయింట్లు, మొహమ్మద్ రెజా 9 పాయింట్లు సాధించగా.. సంజయ్ ధుల్, వినయ్ చెరో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు.
పట్నా తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఇరు జట్లు రెయిడింగ్‌లో చెరో 19 పాయింట్లు సాధించగా... డిఫెన్స్‌లో సత్తా చాటిన స్టీలర్స్ విజాయన్ని ఖరారు చేసుకుంది. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 13 విజయాలు, 4 పరాజయాలతో 67 పాయింట్లు సాధించింది. తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. పట్నా పైరేట్స్ 53 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 8 గంటలకు), తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment