Pro Kabaddi League 2023- నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–28తో గెలిచింది.
ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, మంజీత్ 9 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ తలపడతాయి.
రిత్విక్ జోడీ శుభారంభం
థాయ్‌లాండ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్‌లో రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) ద్వయం 6–3, 6–1తో సెచినాటో–ఫోనియో (ఇటలీ) జోడీని ఓడించింది.
ఇదే టోర్నీలో ఆడుతున్న సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జంట తొలి రౌండ్‌లో 5–7, 6–3, 8–10తో రే హో (చైనీస్ తైపీ)–యున్ సేంగ్ చుంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment