
సౌతాఫ్రికా పేసర్ అన్‌రిచ్ నోర్ట్జే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ 16వ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన నోర్ట్జే గుజరాత్‌తో మ్యాచ్‌లో వస్తూనే తన పవర్ ఏంటో చూపించాడు. తన తొలి ఓవర్‌లోనే సాహాను బౌల్డ్ చేసిన నోర్ట్జే.. తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 148 కిమీ వేగంతో నోర్ట్జే వేసిన బంతికి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఎలా ఆడాలో తెలియక గిల్ తికమక పడగా బంతి వేగానికి లెగ్‌స్టంప్ ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నోర్ట్జే సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. కోరమీసంతో నోర్ట్జే కాస్త కొత్తగా కనిపించాడు. దీంతో నోర్ట్జేపై ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్ చేశారు.'' నీ కొత్త లుక్ అదిరింది పో.. కోర మీసంతో హీరోలా కనిపిస్తున్నావు'' అంటూ పేర్కొన్నారు.
Nortje - Pace is Pace 🔥pic.twitter.com/iutrKpDtng
— Johns. (@CricCrazyJohns) April 4, 2023
Comments
Please login to add a commentAdd a comment