గుజరాత్‌ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ | Injury Rules Harleen Deol Out Of Remainder WPL 2024 | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ

Mar 8 2024 6:29 PM | Updated on Mar 8 2024 6:44 PM

Injury Rules Harleen Deol Out Of Remainder WPL 2024 - Sakshi

మహిళల ఐపీఎల్‌ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్‌ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌ మిగితా డబ్యూపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమైంది. హర్లీన్‌ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్‌ భారతి ఫుల్మలితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

గాయంతో బాధపడుతూనే ఈ సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన హర్లీన్‌.. వరుసగా 8, 22, 18 స్కోర్లు చేసింది. టీమిండియా తరఫున 10 వన్డేలు, 24 టీ20లు ఆడిన ఈ చంఢీఘడ్‌ అమ్మాయి.. రెండు ఫార్మాట్లలో కలిపి 3 అర్దసెంచరీల సాయంతో 458 పరుగులు చేసింది. హర్లీన్‌ స్థానంలో ఎంపికైన భారతి టీమిండియా తరఫున 2 టీ20లు ఆడి 23 పరుగులు చేసింది. దేశవాలీ టోర్నీల్లో విదర్భకు ఆడే భారతి.. మహిళల టీ20 లీగ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. 

ఇదిలా ఉంటే, ప్రస్తుత డబ్యూపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, ఢిల్లీ జట్ల చేతిలో ఓడిన ఈ జట్టు మార్చి 6న మరోసారి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. గుజరాత్‌ రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement