బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభ సీజన్ తొలిరోజునే వివాదం నెలకొంది. గుజరాత్ జెయింట్స్ జట్టు ఫిట్‌నెస్ లేదన్న కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌పై వేటు వేసింది. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఫిట్‌నెస్ లేదని చెప్పి తనను అకారణంగా డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించారంటూ విండీస్ మహిళా క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఆరోపణలు చేసింది. తన ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కింబెర్లీ గార్త్‌ను తీసుకోవడం సరికాదని ఆమె తెలిపింది.
''తొందరగా కోలుకోవాలని నాకు మెసేజ్‌లు పంపిస్తున్నవాళ్లను అభినందిస్తున్నా. అయితే.. నిజం ఏంటంటే..? నేను ఎలాంటి గాయం నుంచి కోలుకోవడం లేదు. ధన్యవాదాలు'' అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లో రాసుకొచ్చింది. చికిత్స తీసుకున్న డాటిన్ ఇంకా కోలుకోలేదని చెప్పి గుజరాత్ జెయింట్స్ డాటిన్‌ను తప్పించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్న డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది.
ఈ మధ్యే ముగిసిన వేలంలో కింబెర్లీ గార్త్‌ను ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికాలో ముగిసిన టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో గార్త్ సభ్యురాలు. అయితే.. ఈమె కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇవాళ(మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
I think we have the 1st #WPL controversy @GujaratGiants need to come up with some clarity
— Mohit Shah (@mohit_shah17) March 4, 2023
No way to treat a legend#WPL2023 pic.twitter.com/qGyrN8l2gH
Comments
Please login to add a commentAdd a comment