మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది.
భారత పేసర్ రేణుకా సింగ్ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది.
ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్‌సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌లకే పరిమితమయ్యారు.
చదవండి: T20 World Cup 2022: ఫేవరెట్ ఎవరు.. ఆసీస్ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది?
Comments
Please login to add a commentAdd a comment