srilankan women
-
Chamari Athapaththu: మహిళా క్రికెట్‌పై.. పట్టు!
83 బంతుల్లో అజేయంగా 108 పరుగులు, 80 బంతుల్లో 140 నాటౌట్, 47 బంతుల్లో అజేయంగా 80 పరుగులు, 31 బంతుల్లో 55, 28 బంతుల్లో 44, 139 బంతుల్లో 195 నాటౌట్, 46 బంతుల్లో 73.. ఇటీవల కీలక మ్యాచ్‌లలో చమరి అటపట్టు సాధించిన స్కోర్లు ఇవి. న్యూజీలండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా లాంటి పటిష్ఠ జట్లపై శ్రీలంక సాధించిన అరుదైన, చారిత్రక విజయాలన్నిట్లో అటపట్టుదే కీలక పాత్ర. లంక జట్టుకు వెన్నుదన్నుగానే కాదు సంచలన బ్యాటింగ్‌తో రికార్డు స్కోర్లు సాధిస్తూ వరల్డ్ నంబర్‌వన్‌గానూ కొనసాగుతోంది. ఈ ఆటకు ఆమె నాయకత్వ ప్రతిభా తోడై శ్రీలంకకు మహిళా ఆసియా కప్ టోర్నీని అందించింది. ఇందులో అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడని, ఏడుసార్లు విజేతైన భారత్‌కు ఫైనల్లో షాక్ ఇస్తూ లంక టైటిల్‌ను అందుకుంది. ఈ టోర్నీలో చమరి ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సహా 304 పరుగులు అదీ 147 స్ట్రైక్ రేట్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.ప్రతి క్రీడలో ఆ దేశపు జాతీయ పతాకాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ఒక ప్లేయర్ అవసరమవుతారు. విజయాలు, పరాజయాలతో సంబంధం లేకుండా సదరు క్రీడపై అందరి దృష్టి పడేలా చేయడం, ఆపై తన వ్యక్తిగత ఆటతో జట్టు స్థాయిని కూడా పెంచడం ఆ ‘ట్రయల్ బ్లేజర్’కే సాధ్యం. శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి చమరి అటపట్టు పాత్ర కూడా సరిగ్గా అలాంటిదే. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో శ్రీలంక జట్టువి అరకొర విజయాలే తప్ప అసాధారణ ప్రదర్శన కాదు. కానీ చమరి తన ఆటతో ఇతర జట్ల దృష్టి తమ టీమ్‌పై పడేలా చేసింది. తన19వ ఏట, 2009 టి20 వరల్డ్ కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2011 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 67 బంతుల్లోనే 60 పరుగులు సాధించడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాతి ఏడాదే శ్రీలంక అత్యుత్తమ మహిళా క్రికెటర్ అవార్డు గెలుచుకోవడంతో చమరి శకం మొదలైంది.రికార్డులే రికార్డులు..వన్డే క్రికెట్లోకి చమరి అడుగుపెట్టిన ఏడాదిలోనే ఐర్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులతో చెలరేగింది. ఫలితంగా శ్రీలంక తరఫున వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు వన్డేల్లో ఆమె మొత్తం తొమ్మిది శతకాలు బాదగా.. మరే శ్రీలంక ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోవడం! అంతర్జాతీయ టి20ల్లో కూడా మూడు సెంచరీలతో ఆమె ఏకైక స్టార్‌గా నిలిచింది. 2017 వన్డే వరల్డ్ కప్‌లో నంబర్‌వన్ టీమ్ ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 178 పరుగుల ఇన్నింగ్స్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఒకటిగా మిగిలింది.34 ఏళ్ల 88 రోజుల వయసులో స్కాట్లండ్‌పై శతకం బాదిన చమరి.. అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీలంక క్రికెట్‌కు సంబంధించి అన్ని వన్డే, టి20 బ్యాటింగ్ రికార్డులు చమరి పేరిటే ఉన్నాయి. నాయకత్వ లక్షణాలూ పుష్కలంగా ఉన్న చమరి మూడు టి20 వరల్డ్ కప్(2018, 2020, 2023)లలో శ్రీలంక టీమ్ సారథిగా వ్యవహరించింది. ఆమె కెప్టెన్సీలోనే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై టి20ల్లో, న్యూజీలండ్పై వన్డేల్లో తొలిసారి శ్రీలంక సిరీస్‌ను గెలుపొందింది. అయితే కెప్టెన్‌గా ఆమె కెరీర్లో అత్యుత్తమ విజయం ఇటీవల ఆసియా కప్‌ను అందుకోవడమే. అసలు భారత జట్టును ఎదురునిలవడమే అసాధ్యం, భారత్ మినహా ఇతర బలహీన టీమ్‌లతో టోర్నీని నిర్వహించడమే అనవసరం అనే విమర్శల నేపథ్యంలో.. చమరి తన టీమ్‌ను ఆసియా విజేతగా నిలపడంతో ఆమె కెరీర్ శిఖరానికి చేరింది.ఫ్రాంచైజీ క్రికెట్లో..వరల్డ్ క్రికెట్లో దూకుడైన బ్యాటర్‌గా, భారీ హిట్టర్‌గా చమరికి వచ్చిన గుర్తింపు ఫ్రాంచైజీ క్రికెట్లో వరుస అవకాశాలనిచ్చింది. లంక తరఫున ఫ్రాంచైజీ క్రికెట్ ఆడిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. ప్రతిజట్టూ తమ టీమ్‌లో ఆమెను ఎంచుకునేందుకు ఆసక్తి చూపించింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్, మెల్బోర్న్ రెనగెడ్స్ జట్ల తరఫున, ఇంగ్లండ్ టీమ్‌లు ఓవల్ ఇన్విన్సిబుల్స్, యార్క్‌షైర్ డైమండ్స్, దక్షిణాఫ్రికా నార్తర్న్ డిస్ట్రిక్ట్స్, వెస్టిండీస్ జట్టు గయానా అమెజాన్ వారియర్స్‌తో పాటు బీసీసీఐ నిర్వహించిన లీగ్ టోర్నీల్లో సూపర్ నోవాస్, యూపీ వారియర్స్‌కి చమరి ప్రాతినిధ్యం వహించింది.2023–24 ఆస్ట్రేలియా క్రికెట్ విమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో 130 స్ట్రైక్‌రేట్‌తో 511 పరుగులు సాధించి ఆమె ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లో అటపట్టు ప్రభావం ఎంతగా ఉందంటే లీగ్‌లో ‘చమరి బే’ పేరుతో ప్రత్యేక సీటింగ్ జోన్ ఏర్పాటు చేసేంతగా! ఆమె కెరీర్లో మరో అత్యుత్తమ క్షణమూ ఇటీవలే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డ పోష్స్ట్రూమ్లో జరిగిన వన్డేలో చమరి 139 బంతుల్లో 26 ఫోర్లు, 5 సిక్సర్లతో 195 పరుగులు తీసి అజేయంగా నిలిచి, తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఆమె బ్యాటింగ్‌తో శ్రీలంక.. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (302) ఛేదించిన జట్టుగా రికార్డుకెక్కింది. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫామ్‌తో చెలరేగిపోతున్న చమరి అటపట్టు రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఘనతలు అందుకోవడం, రికార్డులు సృష్టించడం ఖాయం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శింబు, వధువు ఎవరంటే!
హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా, రైటర్‌గా కూడా శింబుకి గుర్తింపు ఉంది. మల్టీ టాలెంటెడ్‌గా హీరోగా తమిళ నాట విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న శింబు హీరోయిన్స్‌తో లవ్ ఎఫైర్స్, డేటింగ్ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పట్లో నయనతార, హన్సికలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. చదవండి: మిస్ ఇండియాతో నాగార్జున రొమాన్స్! ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ శింబు పెళ్లంటూ వార్తలు రాగా వాటిలో నిజం లేదని తేలింది. ఈసారి మాత్రం శింబు పెళ్లి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు వధువుకు సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ తాజ బజ్ ప్రకారం.. కోటీశ్వరురాలైన శ్రీలంకన్ అమ్మాయితో శింబు త్వరలో ఏడడుగు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో శింబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయి ఓ మెడికల్ స్టూడెంట్ అని, శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని తెలుస్తోంది. ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయట. అయితే ఆ అమ్మాయి శింబుకు పెద్ద అభిమాని అని, ఇదే క్రమంలో ఓ సారి శింబును కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఎర్పడిందట, అది కాస్తా ప్రేమగా మారినట్లు ఫిలిం సర్కిల్లో గుసగుసల వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకుంటున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. చదవండి: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ అయితే ఆయన తండ్రి డి. రాజేంద్రన్ శింబు పెళ్లిపై గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శింబు పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో ఆయన ఫ్యాన్స్ అంత ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శింబు నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. -
బోణీ కొట్టిన శ్రీలంక.. దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ
మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక బోణీ కొట్టింది. కేప్‌టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగల్గింది. సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరచగా.. రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు. అర్ధ సెంచరీతో చెలరేగిన ఆటపట్టు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు గుణరత్నే 35 పరుగులతో రాణించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక
మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది. భారత పేసర్ రేణుకా సింగ్ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: T20 World Cup 2022: ఫేవరెట్ ఎవరు.. ఆసీస్ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది? -
పచ్చ పన్నాగం: భర్త మోసం చేస్తే.. మధ్యవర్తితం పేరుతో టీడీపీ నేత..
సాక్షి, ఏలూరు: ఆమెది ఈ దేశం కాదు. అయితే కట్టుకున్న వాడికోసం దేశం కాని దేశం నుంచి వచ్చి కలహాల కాపురంలో కష్టాలు ఈదుతోంది. మధ్యవర్తిత్వం నెపంతో వచ్చిన ఓ పచ్చ కామాంధుడి చేతిలో నలిగిపోతోంది. వివరాల్లోకెళ్తే.. శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి, ఏలూరు జిల్లా వీరవాసరం మండల పడమటి పాలెంకు చెందిన పితాని వెంకట సత్యనారయణను 2011లో కువైట్‌లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వారు కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉన్నారు. అనంతరం పడమటిపాలెం వచ్చి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు. అయితే భర్త ఆమెకు తెలియకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా సత్యనారాయణ కుటుంబ సభ్యులు కొంత బంగారంతో పాటు, ఐదు లక్షల నగదు తీసుకుని తనపై దాడి చేశారని విజయలక్ష్మి వాపోతోంది. అయితే మాజీ ఎంపీపీ, టీడీపీ నేత వీరవల్లి చంద్రశేఖర్ 2021లో అత్త ఇంటివారి నుంచి రెండున్నర లక్షలు ఇచ్చే విధంగా సెటిల్మెంట్ చేశాడని బాధితురాలు తెలిపింది. కానీ మధ్యవర్తిత్వం చేసి రూ.25వేలు ఇప్పించాడు. మిగిలిన సొమ్ము ఇప్పించమని అడగగా ఇంటికి పిలిచి తనను లోబరుచుకోవడానికి యత్నించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేత చంద్రశేఖర్ లైంగిక వేధించి, బెదిరించాడని శ్రీలంకకు చెందిన విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ('డబ్బే ముఖ్యమని హింసించారు.. నన్ను అర్థం చేసుకోలేదు') -
ఈ పాటకు అమితాబ్ బచ్చన్ ఫిదా.. మీరు వినితీరాల్సిందే!
శ్రీలంక సింగర్ యోహాని దిలోక డె సిల్వ ఒక్క పాటతో వోవర్నైట్ సెన్సేషన్ అయింది. ‘మనికే మగే హితే’ (నా హృదయంలో) అంటూ మొదలయ్యే ఈ సింహళ పాట సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా నెటిజనులను తెగ ఆకట్టుకుంటుంది. టీన్–పాప్ ఈస్థటిక్స్తో రూపుదిద్దుకున్న ఈ పాటను ర్యాపర్ సతీషన్‌తో కలిసి యోహాని ఆలపించింది. పాప్–ఫోక్ మేలుకలయిగా వచ్చిన ఈ పాట మన బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌కు నచ్చింది. మరో విశేషం ఏమిటంటే ఆయన మనవరాలు నవ్య నవేలి ఈ వీడియోను సరదాగా ఎడిట్ చేసింది. తాత నటించిన ‘కాలియ’ సినిమాలోని పాట ‘జహన్ తేరీ యే నజర్ హై’ దృశ్యాన్ని సూపర్ ఇంపోజ్ చేసింది. చదవండి: భుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే! -
Yohani: నా మదిలో మంట రేపావురా
100 మిలియన్ వ్యూస్ సాంగ్/ మాణికె మగే హితే ఒక సింహళగీతం మొన్నటి మే నెలాఖరున విడుదలైంది. సెప్టెంబర్‌కు ప్రపంచమంతా కలిసి వంద మిలియన్ల వ్యూస్‌తో నెటిజన్లు చూశారు. కుర్రకారు పదే పదే ఆ పాట పాడుతున్నారు. ఔత్సాహికులు తమ భాషలో ఆ పాటను రికార్డు చేస్తున్నారు. ఒరిజినల్ సింహళమే అయినా అనేక భారతీయ భాషల్లో అది డబ్ అయ్యింది. 28 ఏళ్ల ర్యాప్ సింగర్ యోహనీ ఈ సెన్సేషన్‌కు కారణం. ఆమె గొంతులో ఏదో ఉంది. ఆ ఏదో ఏమిటనేదాని కోసం కోట్ల మంది ఆ పాటను వింటూనే ఉన్నారు. ఏమిటి ఆ పాట... ఎవ్వరు ఆ గాయని? మాణికె మగే హితే ముదువే నూరా హంగుమ్ యావీ.. అవిలేవీ... ఇదీ ఆ పాట పల్లవి. దీని అర్థం ‘నా మదిలో ఎప్పుడూ నీ తలంపే... మోహజ్వాలలా రగులుతూ ఉంటుంది’ అని అర్థం. యోహనీ ఆ పాటను పాడిన తీరు దానికి కో సింగర్ సతీషన్ గొంతు కలపడం... ఏదో మేజిక్ జరిగింది. అది ఇప్పుడు జగాన్ని ఊపుతోంది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్ అవుతున్న పాట ఇది. గతంలో ఒక సింగర్‌కు గుర్తింపు రావాలంటే ఎన్నో పాటలు పాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక్క సరైన పాట పాడితే రాత్రికి రాత్రి స్టార్‌ని చేసేస్తోంది. యోహని అలా ఇప్పుడు శ్రీలంకకు బయట స్టార్ అయ్యింది. చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టపడే యోహనీ సింగింగ్నే కెరియర్‌గా ఎంచుకుని ఇప్పుడు ఈ పాటతో ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. శ్రీలంక కోయిల 1993 జూలై 30న కొలంబోలో మేజర్ జనరల్ ప్రసన్న డిసిల్వా, దినితి డిసిల్వాలకు పుట్టింది యోహని. ఈమెకు ఒక చెల్లెలు ఉంది. తండ్రి ఆర్మీ అధికారి, తల్లి ఎయిర్ హోస్టెస్ కావడంతో చిన్నతనంలో శ్రీలంకతోపాటు మలేసియా, బంగ్లాదేశ్‌లలో పెరిగింది. లాజిస్టిక్స్ మేనేజ్మెంట్లో డిగ్రీ అయ్యాక అక్లాడే కంపెనీలో మేనేజర్‌గా చేరింది. ఇక్కడ ఏడాది పనిచేశాక మెల్బోర్న్ వెళ్లి క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. యోహనీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఎనలేని అభిమానం. ఆ ఆసక్తిని గమనించిన తల్లి ఆ దిశగా ప్రోత్సహించడంతో ర్యాప్, పాప్, క్లాసికల్ సాంగ్స్‌ను పాడడం నేర్చుకుంది. పెట్టా ఎఫ్ట్కెట్ లేబుల్ రికార్డింగ్‌తో కలిసి ‘ఆయే’ పాటను పాడి సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ర్యాప్ ప్రిన్సెస్... 2016లో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి కవర్ సాంగ్స్ వీడియోలను అప్లోడ్ చేసేది. వాటికి మంచి స్పందన లభించడంతో తనే స్వయంగా పాడిన పాటలను విడుదల చేసింది. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్ పాటంతో యోహనీకి సింగర్‌గా మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి ఆమె తన యూట్యూబ్ చానల్లో అనేక పాటలను విడుదల చేసింది. వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో పాపులర్ బ్యాండ్స్‌తో కలసి మ్యూజిక్ షోలలో పాల్గొనేది. తరువాత తమిళ పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యింది. దీంతో ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక టైటిల్’ను గెలుచుకుంది. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన పాటలు పాడుతూ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుండేది. దీంతో యోహనీ పాటలు ఒక్క శ్రీలంకలోనేగాక ఇండియా, బంగ్లాదేశ్, మలేషియాల్లో కూడా బాగా వైరల్ అయ్యేవి. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్ ఉన్న ఏకైక శ్రీలంక గాయనిగా రికార్డు స్థాపించింది. సింగిల్‌గా పాడిన పాటలేగాక సితా దౌవున, హాల్ మాస్సా వియోలే, యావే, ఆయితే వారాక్ వంటి ఆల్బమ్స్ కూడా చేసింది. వివిధ వేదికలు, సెమినార్లలో లైవ్ పెర్ఫార్మ్స్ కూడా ఇచ్చింది. గాయనిగానే కాక పాటల రచయిత, మ్యూజిక్ ప్రొడ్యూసర్, వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ‘ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక’ అయ్యాక శ్రీలంకలోనే పాపులర్ సింగర్స్‌తో కలిసి పనిచేసింది. యోహని పాడిన పాటల్లో ఒక పాట ‘బెస్ట్ వీడియో రీమేక్’ అవార్డును గెలుచుకుంది. ఇవేగాక రెడ్‌బుల్ నిర్వహించే కన్సర్ట్లలో ఆమె పాల్గొనడం విశేషం. యోహనీ పాడిన పాటల్లో మాణికే మాగే హితే, యోహనీ మెర్రి క్రిస్టమస్ బేబీ, లా రోజ్ ఎట్లెపైన్ వాల్యూమ్–1, నలుమ్బనయా, హాల్ మస్సా వయోలే వయోలే, నషక్షాలే, బుల్మా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మాణికే మగే హితే.. యోహనీ, సతీషన్ కలిసి పాడిన ఈ పాటను సెప్టెంబర్‌లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ యష్‌రాజ్ ముఖతే ఇన్‌స్టాలో పోస్టు చేసిన వెంటనే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. తరువాత బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సాంగ్ బీట్‌కు కాలు కదిపినట్లుగా స్పూఫ్ వీడియో చేశారు. అప్పటి నుంచి ఈ పాట బాగా వైరల్ అయ్యింది. ఇటీవల ఖాళీగా ఉన్న విమానంలో ఎయిర్ హోస్టెస్ ‘మాణికే మగే హితే’కు డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేయడంతో విపరీతంగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ‘మాణికే మగే హితే’ పాట వంద మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. యోహనీకి ఇన్‌స్ట్రాగామ్‌లో ఐదులక్షల మందికిపైగా ఫాలోవర్స్ ఉండడం విశేషం. మీరు ఇప్పటి వరకూ ఈ పాట వినకపోతే వినండి. మళ్లీ వింటారు. -
శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సప్ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా) ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషాసైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. I would like to thank Commissioner of Police @chennaipolice_ Additional Commissioner of Police-Central Crime Branch and Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗 — Arya (@arya_offl) August 24, 2021 -
పెళ్లి చేసుకుంటానని మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా సైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
ఆస్తి కోసం శ్రీలంక మహిళ హైడ్రామా!
సాక్షి, చెన్నై : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి.. శ్రీలంకకు చెందిన మహిళ ఆస్తి కోసం దేశాలు దాటి పెళ్లి చేసుకున్న భర్తను మట్టుబెట్టి ఆపై రక్తికట్టించిన హైడ్రామా గుట్టును తిరుచ్చి పోలీసులు రట్టు చేశారు. అందాన్ని అడ్డం పెట్టుకుని ఆమె తొక్కిన అడ్డదారులన్నీ విచారణలో వెలుగు చూశాయి. తిరుచ్చి– సమయనల్లూరు జాతీయ రహదారిలో రెండు రోజుల క్రితం కారులో వెళ్తున్న యూసఫ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి హతమార్చారు. పట్టపగలు సాగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేగడంతో పోలీసులు కేసును సవాల్‌గా తీసుకున్నారు. అదే సమయంలో పోలీసు స్టేషన్‌కు నలుగురు న్యాయవాదుల్ని వెంటేసుకొచ్చిన శ్రీలంకకు చెందిన హసీనా ఇచ్చిన సమాచారం పోలీసుల విచారణకు కీలకంగా మారింది. యూసఫ్‌కు తాను రెండో భార్య అని, తామిద్దరం కువైట్‌లో ఐదేళ్ల క్రితం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుని తంజావూరులో కాపురం పెట్టామని వివరించారు. తనకు ఇటీవలే ఓ సమాచారం తెలిసిందని, ఇది వరకే యూసఫ్‌కు పెళ్లి జరిగిందని, అనేక మంది యువతులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఆరోపించారు. ఈ హత్య వారిలో ఎవరైనా చేయించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సదరు మహిళ న్యాయవాదులతో వచ్చి మరీ ఇచ్చిన సమాచారం పోలీసుల్లో అనుమానాల్ని రెకెత్తించాయి. ఆమె ఇచ్చిన వివరాల్ని నమోదు చేసుకుని ఆ దిశగా కేసు విచారణ మీద దృష్టి చేపట్టారు. ఆస్తి కోసం.. అనేక మంది యువతుల్ని యూసఫ్ మోసం చేస్తుండడంతోనే వారి జీవితాల్ని కాపాడేందుకు చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవాల్సి వచ్చినట్టుగా ఆమె ఓ కథ చెప్పినా, నమ్మే స్థితిలో లేమంటూ ట్రీట్మెంట్ తీవ్రతను పెంచగా అస్సలు గుట్టును విప్పింది. వివరాలు.. యూసఫ్ పేరిట అనేక చోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు లాకర్లలో మూడు వందల సవర్లకు మేరకు నగలు, నగదు ఉన్నట్టు హసీనా గుర్తించింది. వాటిని దక్కించుకునేందుకు అందాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్ని తొక్కే పనిలో పడింది. ఫేస్బుక్లో తనకు పరిచమైన నలుగురు యువకుల్ని ఎంపిక చేసుకుంది. వారితో సన్నిహితం పెంచుకుంది. అంతేకాదు మరో నలుగురు న్యాయవాదుల్ని వలలో వేసుకుంది. వీరి ద్వారా యూసఫ్ ఖాతా ఉన్న బ్యాంక్ మేనేజర్‌కు మరింతదగ్గరయ్యింది. తొలుత బ్యాంక్ మేనేజర్ మారం చేసినా, తదుపరి హసీనాకు దాసోహమయ్యాడు. బ్యాంక్ లాకర్లలో ఉన్న దస్తా వేజులు, నగలు, నగదు అన్నీ హసీనా తన సొంతం చేసుకుంది. ఈ సమాచారం ఓ మిత్రుడి ద్వారా తెలుసుకున్న యూసఫ్ గత ఏడాది చివర్లో ఇండియాకు చేరుకున్నాడు. హసీనాతో గొడవ పడ్డాడు. ఆమెను దూరం పెట్టాడు. విడాకుల నోటీసు పంపించాడు. చట్టపరంగానే తన ఆస్తులన్నీ మళ్లీ దక్కించుకునే సిద్ధమయ్యాడు. ఇవన్నీ యూసఫ్ కూడా గుట్టచప్పుడు కాకుండా, తన పరువు పోకుండా జాగ్రత్తపడుతూ ముందుకు సాగాడు. ఇవన్నీ తనకు అనుకూలంగా మలచుకున్న హసీనా ఫేస్ బుక్ ప్రియులు, న్యాయవాదుల సహకారంతో ఓ కిరాయి ముఠాను ఆశ్రయించింది. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకుని యూసఫ్‌ను మట్టుబెట్టేందుకు పథకం రచించింది. లాక్డౌన్ కారణంగా మర్డర్ ప్లాన్ ఆలస్యం అయింది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం పథకం ప్రకారం హతమార్చి, మొదటి భార్య మీద నిందల్ని వేయడానికి యత్నించి అడ్డంగా బుక్కైంది. హసీనాతో పాటుగా నలుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు కేసు విచారణను మరింత ముమ్మరం చేశారు. యూసఫ్ ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను పరిశీలిస్తున్నారు. పరారీలో ఉన్న ఫెస్బుక్ ప్రియులు, సలహా ఇచ్చిన న్యాయవాదుల కోసం వేట సాగుతోంది. వెలుగులోకి హైడ్రామా.. దుబాయ్, కువైట్లలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న యూసఫ్‌కు తిరుచ్చిలో భార్య పిల్లలు ఉన్నట్టు తేలింది. విదేశాల్లో శ్రీలంకకు చెందిన హసీనా మీద మోజుపడ్డ యూసఫ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హసీనాతో తంజావూరులో కాపురం పెట్టగా, తిరుచ్చిలో మొదటి భార్య, పిల్లల్ని ఉంచాడు. ఇక్కడకు వచ్చినప్పుడల్లా ఇద్దరికీ న్యాయం చేస్తూనే వచ్చాడు. ఎక్కువ సమయం హసీనా ఇంట్లోనే గడిపేవాడు. ఈ హత్య మొదటి భార్య తరఫు వాళ్లే చేయించి ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తును పోలీసులు తీసుకెళ్లారు. అటు వైపుగా అంత సమర్థులెవ్వరూ లేరని తేలింది. హసీనాను పిలించిని మహిళా పోలీసులతో స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో గుట్టరట్టయ్యింది. -
వివాహం చేయిస్తారా? శ్రీలంకకు పంపిస్తారా..?
తిరువొత్తియూరు: ఫేస్బుక్ ప్రియుడితో చెన్నైలో ఉంటున్న శ్రీలంక యువతిని పోలీసులు రక్షించారు. శ్రీలంక రత్నపుర జిల్లా సమకిపురారాజ్‌వార్ తాలూకాకు చెందిన జైనుల్లాబుద్ధీన్ కుమార్తె రిషేవి ఫాతిమా గుప్త (21). బన్రూట్టి సమీపం వి.ఆండికుప్పం గ్రామానికి చెందిన మహ్మద్ ముబారక్ (25) చెన్నైలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రిష్వి ఫాతిమాగుప్త గత నెల 26వ తేదీ పర్యాటక వీసాపై చెన్నైకి వచ్చారు. (ఎల్లలు దాటిన ఫేస్బుక్ ప్రేమ) తరువాత బన్రూట్టికి వెళ్లి ప్రియుడితో కలిసినట్టు తెలిసింది. ఈ లోపు కుమార్తె ప్రేమ వ్యవహారం తెలుసుకున్న జైనుల్లా ఆగ్రహం చెంది అత్యవసరంగా దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చాడు. తరువాత కడలూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీఅభినవ్ వద్ద తన కుమార్తెను విడిపించాలని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బన్రూట్టి పోలీసు ఇన్స్పెక్టర షణ్ముగం నేతృత్వంలో రిష్వి ఫాతిమా గుప్త కోసం గాలించారు. ఆమె చెన్నైలో ఉంటున్నట్టు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు రిష్వి ఫాతిమా గుప్తాను ప్రియుడి వద్ద నుంచి విడిపించారు. ప్రియుడిని బన్రూట్టికి పిలిపించి విచారణ చేస్తున్నారు. శ్రీలంక యువతి మేజర్ కావడంతో ఆమె ప్రియుడితో వివాహం చేయిస్తారా? శ్రీలంకకు పంపిస్తారా..? తెలియాల్సి ఉంది. -
భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ
టీ.నగర్: ఆస్ట్రేలియా నుంచి చెన్నైకు వచ్చి రెం డవ వివాహానికి ప్రయత్నించిన భర్తను శ్రీలం క మహిళ బుధవారం పోలీసులకు అప్పగిం చింది. ఈ సంఘటన వడపళణిలో సంచలనం కలిగించింది. శ్రీలంక మట్టకళప్పు తిరుమలై ప్రాంతానికి చెందిన దిశాంతిని(33)కి 2012 లో శ్రీలంకకు చెందిన రాజకుళేంద్రన్‌తో వివా హం జరిగింది. వీరికి మగ్గిపన్ అనే కుమారుడు వున్నాడు. ఇరువురి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా రాజకుళేంద్రన్ తన భార్యను విడచి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. ఇరువురి వివాదం గురించి మట్టకళప్పు పోలీసుస్టేషన్లో కేసు నమోదై ఉంది. ఇలా ఉండగా రాజకుళేంద్రన్ శ్రీలంకకు చెందిన మహిళ ఒకరిని రెండవ వివాహం చేసుకునేందుకు నిర్ణయించినట్లుతెలిసింది. దీంతో రాజకుళేంద్రన్ గత ఐదవ తేదీ ఆస్ట్రేలియా నుంచి చెన్నైకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం శ్రీలంకలో వున్న దిశాంతినికి తెలిసింది. వెంటనే ఆమె చెన్నైకు వచ్చి భర్త ఉంటున్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ సమయంలో రెండవ వివాహం చేసుకోనున్న మహిళ ఆ గదిలో ఉన్నట్లు సమాచారం. తర్వాత దిశాంతిని వడపళణి మహిళా పోలీసుస్టేషన్లో దీని గురించి పిర్యాదు చేశాడు. ఇందులో తన భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి రెండవ వివాహానికి ప్రయత్నిస్తున్నాడని అందుచేత భర్తతో తనను కలపాలని కోరింది. దీంతో పోలీసులు బుధవారం రాజకుళేంద్రన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
ఆంధ్ర అబ్బాయి..శ్రీలంక అమ్మాయి..చూపులు కలిసిన వేళ!
సాక్షి, కొవ్వూరు రూరల్: మనం పుట్టినపుడే మనతో ఎవరు ఏడడుగులు వేస్తారో అనేది దేవుడు రాసి పెడతాడని పెద్దలు చెబుతారు. ఈ సంఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కో దేశం. ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లిన వారి మనసులు కలిశాయి. రెండున్నరేళ్ల ప్రేమ తరువాత పెళ్లితో ఒక్కటవుదామనుకున్న వారికి జిల్లాలోని కొవ్వూరులో బసివిరెడ్డి పేటలో ఉన్న సత్యన్నారాయణ స్వామి దేవాలయం వేదికగా మారింది. ఆదివారం బంధువుల సమక్షంలో వారు సంప్రదాయం బద్ధంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన మావుడూరి ఉమామహేష్ ఉపాధి కోసం మస్కట్ వెళ్లాడు. ఓ హోటల్లో సూపర్వైజర్గా చేరారు, అదే హోటల్లో ఉద్యోగంలో చేరిన శ్రీలంకకు చెందిన రువీని హెమలీని మొదటిసారి చూసినపుడే ప్రేమలో పడ్డారు. ఈ విధంగా రెండున్నరేళ్లపాటు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. రువీని హెమలీకి తల్లిదండ్రులు లేకపోవడంతో ఈ విషయాన్ని ఉమామహేష్ తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తెలియజేసి ఒప్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 8గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో ఆ ప్రేమ జంట ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, తల్లిదండ్రులు లేని లోటు అత్తమామల ద్వారా తీరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నూతన వధూవరులకు మంత్రి వనిత దీవెనలు నూతన వధూవరులు ఉమామహేష్, రువిని హేమలీకి మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి మండపంలో వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత కుల, మతాల పట్టింపులనే∙కాదు దేశ సరిహద్దులను తమ ప్రేమతో చెరిపేస్తున్నారని అన్నారు, నూతన వధూవరుల దాంపత్య జీవితం సుఖఃశాంతులతో సాగాలని అభిలషించారు. కంఠమణి రమేష్‌బాబు, పరిమి సోమరాజు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
శ్రీలంక మహిళ అక్రమనివాసం
రాజంపేట: టూరిస్టు వీసాతో వైఎస్సార్ జిల్లా రాజంపేటకు వచ్చిన శ్రీలంక మహిళ దిశానాయకే ముదియన్శెలగే నంద అక్రమ నివాసం ఉన్నందువల్ల అరెస్టు చేసినట్లు రాజంపేట రూరల్ సీఐ హేమసుందరరావు తెలిపారు. ఈమేరకు శుక్రవారం అమె అరెస్టును విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. రాజంపేట మండలం తమ్మిరెడ్డిపల్లె గోపమాంబపురానికి చెందిన తమ్మిరెడ్డి విశ్వనాధరెడ్డిని నంద ప్రేమవివాహం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రాజంపేటలోని రాంనగర్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నట్లు తెలిపారు. టూర్ వీసాతో వచ్చిన విదేశీయురాలు వీసాకాలం అయిపోయినా ఇక్కడే నిలిచిపోయిందన్నారు. చట్టవ్యతిరేకంగా ఇండియాలో ఉంటూ, భారతదేశవాసిగా దొంగపత్రాలు సృష్టించుకొని కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీనిపై విచారణ అధికారి ఆర్వీ రసింహరావు(ఎస్బీహెచ్) ఫిర్యాదు మేరకు మన్నూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమేరకు గురువారం రాంనగర్లో ఆమెను అరెస్టు చేసి, శుక్రవారం రాజంపేట జేఎఫ్‌సీఎం జడ్జి ఎదుట ప్రవేశపెట్టామన్నారు. 14రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఆమెకు సహకరించిన తమ్మిరెడ్డి విశ్వనాథరెడ్డి అరెస్టు కావాల్సి ఉందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు.