Sri Lanka Singer Yohani Diloka Song Manike Mage Hithe went viral - Sakshi
Sakshi News home page

ఈ పాటకు అమితాబ్‌ బచ్చన్‌ ఫిదా.. మీరు వినితీరాల్సిందే!

Published Fri, Oct 22 2021 8:36 AM | Last Updated on Fri, Oct 22 2021 5:32 PM

Sri Lanka Singer Yohani Diloka Song Manike Mage Hithe went viral - Sakshi

శ్రీలంక సింగర్‌ యోహాని దిలోక డె సిల్వ ఒక్క పాటతో వోవర్‌నైట్‌ సెన్సేషన్‌ అయింది. ‘మనికే మగే హితే’ (నా హృదయంలో) అంటూ మొదలయ్యే ఈ సింహళ పాట సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా నెటిజనులను తెగ ఆకట్టుకుంటుంది. టీన్‌–పాప్‌ ఈస్థటిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాటను ర్యాపర్‌ సతీషన్‌తో కలిసి యోహాని ఆలపించింది.

పాప్‌–ఫోక్‌ మేలుకలయిగా వచ్చిన ఈ పాట మన బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌కు నచ్చింది. మరో విశేషం ఏమిటంటే ఆయన మనవరాలు నవ్య నవేలి ఈ వీడియోను సరదాగా ఎడిట్‌ చేసింది. తాత నటించిన ‘కాలియ’ సినిమాలోని పాట ‘జహన్‌ తేరీ యే నజర్‌ హై’ దృశ్యాన్ని సూపర్‌ ఇంపోజ్‌ చేసింది.

చదవండిభుజంపై భారంతో బన్నీ, ఒంటికాలుతో ప్రభుదేవా.. తగ్గేదే లే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement