Is Simbu Is Marrying Srilankan Girl, Wedding Arrangements Going On - Sakshi
Sakshi News home page

Hero Simbu Wedding: బడా వ్యాపారవేత్త కూతురితో హీరో శింబు పెళ్లి? గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు!

Published Fri, Feb 24 2023 1:14 PM | Last Updated on Fri, Feb 24 2023 2:44 PM

Is Simbu is Marrying Srilankan Girl, Wedding Arrangements going on - Sakshi

హీరో  శింబు క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో అయిన శింబుకి తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వల్లభ, మన్మధ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు శింబు. నటుడిగానే కాదు, సింగర్‌గా, సంగీత దర్శకుడిగా, రైటర్‌గా కూడా శింబుకి గుర్తింపు ఉంది. మల్టీ టాలెంటెడ్‌గా హీరోగా తమిళ నాట విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకున్న శింబు హీరోయిన్స్‌తో లవ్‌ ఎఫైర్స్‌, డేటింగ్‌ రూమర్స్‌తో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. అప్పట్లో నయనతార, హన్సికలతో ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే.

చదవండి: మిస్‌ ఇండియాతో నాగార్జున రొమాన్స్‌!

ఇదిలా ఉంటే ఇప్పుడు శింబు ఓ ఇంటివాడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ శింబు పెళ్లంటూ వార్తలు రాగా వాటిలో నిజం లేదని తేలింది. ఈసారి మాత్రం శింబు పెళ్లి వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు వధువుకు సంబంధించిన వివరాలు కూడా సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి. ఈ తాజ బజ్‌ ప్రకారం.. కోటీశ్వరురాలైన శ్రీలంకన్‌ అమ్మాయితో శింబు త్వరలో ఏడడుగు వేయబోతున్నాడని సమాచారం. ఆమెతో శింబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడట. ఆ అమ్మాయి ఓ మెడికల్‌ స్టూడెంట్‌ అని, శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురని తెలుస్తోంది. 

ఆమె తండ్రికి శ్రీలంకలో పలు వ్యాపార సంస్థలు ఉన్నాయట. అయితే ఆ అమ్మాయి శింబుకు పెద్ద అభిమాని అని, ఇదే క్రమంలో ఓ సారి శింబును కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఎర్పడిందట, అది కాస్తా ప్రేమగా మారినట్లు ఫిలిం సర్కిల్‌లో గుసగుసల వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలుసుకున్నాయని, గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఏర్పాట్లపై చర్చించుకుంటున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

చదవండి: ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్‌.. దాదాపు 200 థియేటర్లో రి-రిలీజ్‌కు రెడీ

అయితే ఆ‍యన తండ్రి డి. రాజేంద్రన్‌ శింబు పెళ్లిపై గతంలో ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తన కుమారుడు అతి త్వరలోనే పెళ్లి చేసుకుంటాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శింబు పెళ్లి వార్తలు తెరపైకి రావడంతో ఆయన ఫ్యాన్స్‌ అంత ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన హీరో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ శింబు ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శింబు నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement