భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ | Sri lankan Women Complaint on Husband in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

Published Fri, Aug 9 2019 8:14 AM | Last Updated on Fri, Aug 9 2019 8:14 AM

Sri lankan Women Complaint on Husband in Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

టీ.నగర్‌: ఆస్ట్రేలియా నుంచి చెన్నైకు వచ్చి రెం డవ వివాహానికి ప్రయత్నించిన భర్తను శ్రీలం క మహిళ బుధవారం పోలీసులకు అప్పగిం చింది. ఈ సంఘటన వడపళణిలో సంచలనం కలిగించింది. శ్రీలంక మట్టకళప్పు తిరుమలై ప్రాంతానికి చెందిన దిశాంతిని(33)కి 2012 లో శ్రీలంకకు చెందిన రాజకుళేంద్రన్‌తో వివా హం జరిగింది. వీరికి మగ్గిపన్‌ అనే కుమారుడు వున్నాడు. ఇరువురి మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా రాజకుళేంద్రన్‌ తన భార్యను విడచి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. ఇరువురి వివాదం గురించి మట్టకళప్పు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదై ఉంది. ఇలా ఉండగా రాజకుళేంద్రన్‌ శ్రీలంకకు చెందిన మహిళ ఒకరిని రెండవ వివాహం చేసుకునేందుకు నిర్ణయించినట్లుతెలిసింది. దీంతో రాజకుళేంద్రన్‌ గత ఐదవ తేదీ ఆస్ట్రేలియా నుంచి చెన్నైకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం శ్రీలంకలో వున్న దిశాంతినికి తెలిసింది. వెంటనే ఆమె చెన్నైకు వచ్చి భర్త ఉంటున్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఆ సమయంలో రెండవ వివాహం చేసుకోనున్న మహిళ ఆ గదిలో ఉన్నట్లు సమాచారం. తర్వాత దిశాంతిని వడపళణి మహిళా పోలీసుస్టేషన్‌లో దీని గురించి పిర్యాదు చేశాడు. ఇందులో తన భర్త ఆస్ట్రేలియా నుంచి వచ్చి రెండవ వివాహానికి ప్రయత్నిస్తున్నాడని అందుచేత భర్తతో తనను కలపాలని కోరింది. దీంతో పోలీసులు బుధవారం రాజకుళేంద్రన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement