
మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక బోణీ కొట్టింది. కేప్‌టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగల్గింది.
సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరచగా.. రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు.
అర్ధ సెంచరీతో చెలరేగిన ఆటపట్టు
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు గుణరత్నే 35 పరుగులతో రాణించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు.
చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్!