కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది.
సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్‌ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది.
నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్‌ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్‌స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147.
బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0.
భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్‌ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్‌స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119.
బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్‌స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0.
Comments
Please login to add a commentAdd a comment