
కకామిగహారా(జపాన్):మహిళల హాకీ ఆసియా కప్ లో భాగంగా భారత్ తన ఆరంభపు మ్యాచ్ లో దుమ్ములేపింది. పూల్-ఎ లో శనివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 10-0 తేడాతో సింగపూర్ పై సంచలన విజయం సాధించింది. భారత జట్టులో నవనీత్ కౌర్(3,41 నిమిషాల్లో), రాణి(15, 18 నిమిషాల్లో), నవజోత్ కౌర్(30, 50 నిమిషాల్లో) తలో రెండు గోల్సో తో సత్తా చాటగా, లాల్రెమ్ సియామి(18 నిమిషం), దీప్ గ్రేస్ ఎక్కా(25 నిమిషం), గుర్జిత్ కౌర్(41 నిమిషం), సోనికా(45నిమిషం) ఒక్కో గోల్ చొప్పున చేసి విజయంలో ముఖ్య భూమిక పోషించారు.
భారత జట్టు ఆది నుంచి సింగపూర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతూ పాయింట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ప్రధానంగా సింగపూర్ రక్షణ శ్రేణిని చెల్లాచెదురు చేసి గోల్స్ వర్షం కురిపించింది. తొలి 20 నిమిషాల్లోనే భారత జట్టు నాలుగు గోల్స్ సాధించడంతో సింగపూర్ డీలా పడిపోయింది. అదే ఊపును కడవరకూ కొనసాగించిన భారత్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, సింగపూర్ కడవరకూ పోరాటం చేసినా కనీసం గోల్ కూడా సాధించలేదు.
Comments
Please login to add a commentAdd a comment