U-19 Women T20 Series: India Beat South Africa By 54 Runs to Take Lead - Sakshi
Sakshi News home page

Ind_W Vs SA_W: అదరగొట్టిన షబ్నమ్‌.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

Published Wed, Dec 28 2022 7:58 AM | Last Updated on Wed, Dec 28 2022 11:13 AM

U 19 Women T20 Series: India Beat South Africa By 54 Runs Take Lead - Sakshi

అర్చనా దేవి- షకీల్‌ షబ్నమ్‌ (PC: BCCI)

India Women Under-19s tour of South Africa, 2022-23- ప్రిటోరియా: వచ్చే నెలలో జరిగే అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి టి20లో భారత్‌ 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళలను ఓడించింది.

మొదట భారత అండర్‌–19 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (0) డకౌట్‌ కాగా, శ్వేత (39 బంతుల్లో 40; 5 ఫోర్లు), సౌమ్య (46 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. రిచా ఘోష్‌ 15 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో హ్లుబి, కేలా రేనకె చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా అండర్‌–19 జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది. ఆంధ్ర సీమర్‌ షబ్నమ్‌ షకీల్‌ (3/15)తో పాటు అర్చన దేవి (3/14) కూడా చెలరేగి ప్రత్యర్థిని పడగొట్టారు. జనవరి 14 నుంచి 29 వరకు తొలి సారి అండర్‌–19 మహిళల టి20 దక్షిణాఫ్రికాలోనే జరగనుంది.  

చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement