మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత వికెట్ యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు ఊహించని ధర దక్కింది. ఈ వేలంలో రిచా ఘోష్ రూ.1.9 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. రిచా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి ఆర్సీబీ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో రిచా తన కనీస ధరను రూ.50 లక్షలగా రిజిస్టర్ చేసుకోవడం గమానార్హం.
కాగా రిచా ఘోష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆమె సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. 20 బంతుల్లో 31 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొట్ట తొలి అండర్-19 ప్రపంచకప్‌లో కూడా 19 ఏళ్ల రిచా దుమ్మురేపింది.
స్మృతి మంధానపై కాసుల వర్షం
ఈ వేలంలో స్మృతి మంధానపై కాసుల వర్షం కురిసింది. ఆమెను ఏకంగా రూ.3.4 కోట్ల ధరకు ఆర్సీబీనే సొంతం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(రూ.2కోట్లు), భారత పేసర్ రేణుకా సింగ్(రూ.1.5కోట్లు), ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీని (రూ.1.7 కోట్లు)ని ఆర్సీబీ దక్కించుకుంది.
చదవండి: WPL 2023 Auction: స్మృతి మంధానకు జాక్ పాట్.. ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment