
Photo: IPL Twitter
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో శివతాండవం ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి చరిత్రకెక్కాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుని రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు దేశవాళీలో మంచి ఫామ్ కనబరిచిన జైశ్వాల్ కూడా జైస్వాల్ అదరగొట్టాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు.
13 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.. ఇక ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 12 బంతుల్లోనే యువరాజ్ ఈ ఫీట్ సాధించాడు. ఇక యువరాజ్ తర్వాత జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. 2007 టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై యువీ 12 బాల్స్ లోనే ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదిన రికార్డు కూడా ఉంది.
The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN
— JioCinema (@JioCinema) May 11, 2023