IPL 2023, KKR Vs RCB: Shardul Thakur 20 Ball 50 Runs Joint Fastest 50 This Season - Sakshi
Sakshi News home page

#Lord Shardul: ఆర్‌సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు

Published Thu, Apr 6 2023 9:39 PM | Last Updated on Fri, Apr 7 2023 10:47 AM

Shardul Thakur-20-ball-50 Runs Joint fastest 50-Jos Buttler This Season - Sakshi

Photo: IPL Website

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఆర్‌సీబీకి చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించిన శార్దూల్‌ ఐపీఎల్‌లో తొలి అర్థసెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే  అర్థశతకం మార్క్‌ అందుకున్న శార్దూల్‌ ఠాకూర్‌ ఈ సీజన్‌లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్‌ జాస్‌ బట్లర్‌ కూడా 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు.

ఇక కేకేఆర్‌ తరపున ఏడు, ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 50ప్లస్‌ స్కోరు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు. ఇంతకముందు ఆండ్రీ రసెల్‌ ఐదుసార్లు, పాట్‌ కమిన్స్‌ మూడుసార్లు, సాహా, శార్దూల్‌ ఠాకూర్‌లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఇక ఏడు ఆ తర్వాత స్థాన్లాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఐపీఎల్‌లో అత్యధిక​ స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్‌ చోటు సంపాదించాడు. 

ఓవరాల్‌గా శార్దూల్‌ 29 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 150 కూడా కష్టమనుకున్న తరుణంలో రింకూ సింగ్‌(33 బంతుల్లో 46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించి కేకేఆర్‌ స్కోరు 200 మార్క్‌ అందుకునేలా చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement