చిక్కుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్‌ | Sanath Jayasuriya Charged For Breaching ICC Anti Corruption Code | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 15 2018 7:27 PM | Last Updated on Mon, Oct 15 2018 7:28 PM

Sanath Jayasuriya Charged For Breaching ICC Anti Corruption Code - Sakshi

జయసూర్య

ఐసీసీ నియమాల ప్రకారం తీసుకోబోయే చర్యలకు ..

దుబాయ్‌ : శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య చిక్కుల్లో పడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిబంధనలు ఉల్లంఘించాడని ఈ మాజీ క్రికెటర్‌పై రెండు అభియోగాలు నమోదయ్యాయి. 14 రోజుల్లోగా వీటికి సమాధానం ఇవ్వాలని ఐసీసీ నోటీసులు జారీ చేసింది. స్పందించకపోతే ఐసీసీ నియమాల ప్రకారం తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఆర్టికల్ 2.4.6 ప్రకారం విచారణకు అందుబాటులో లేకపోవడం, విచారణ అధికారులకు సహకరించకపోవడం, కావల్సిన సమాచారాన్ని, డాక్యుమెంట్లను సమర్పించకపోవడం వంటి ఫిర్యాదులతో పాటు ఆర్టికల్ 2.4.7 ప్రకారం విచారణ ఆలస్యం కావడానికి ప్రత్యేక్షంగా కారణమవ్వడం, ఆధారాలు, సాక్ష్యాలను మాయం చేయడం వంటి రెండు ఆర్టికల్స్ కింద జయసూర్యపై ఐసీసీ అభియోగాలు నమోదుచేసింది. 

దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సనత్ జయసూర్య... 445 వన్డేలు, 110 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.  వన్డేల్లో సచిన్‌ తర్వాత జయసూర్యనే 13430 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 323 వికెట్లు పడగొట్టాడు. 1996లో లంకజట్టు వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక జట్టు సెలక్షన్‌ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement