శ్రీలంక ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు.. వెంటనే తిరిగి రావాలని..! | Sri Lanka orders Kamil Mishara to return home from Bangladesh | Sakshi
Sakshi News home page

BAN vs SL: శ్రీలంక ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు.. వెంటనే తిరిగి రావాలని..!

Published Tue, May 24 2022 6:18 PM | Last Updated on Tue, May 24 2022 10:09 PM

Sri Lanka orders Kamil Mishara to return home from Bangladesh  - Sakshi

శ్రీలంక యువ ఆటగాడు కమిల్ మిషారాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక జట్టులో మిషారా భాగమై ఉన్నాడు. అయితే రెండు  టెస్టులోను అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. కాగా  శ్రీలంక జట్టు బస చేస్తున్న హోటల్‌ మిషారా గదిలో ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నట్లు తెలుస్తుంది. తద్వారా ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించనందకుకు తక్షణమే అతడు స్వదేశానికి తిరిగి రావాలని శ్రీలంక క్రికెట్‌ ఆదేశించింది.

"మేము హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను పరీశీలించాం. మేము చూసిన వాటిపై మేము అతడిని విచారించాలి అనుకుంటున్నాము" అని శ్రీలంక క్రికెట్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక 21 ఏళ్ల  కమిల్ మిషారా ఇప్పటి వరకు మూడు టీ20లు మాత్రమే ఆడాడు. ఇక బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ డ్రా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఛాటోగ్రామ్‌ వేదికగా జరగుతోన్న నిర్ణయాత్మక రెండు టెస్టులో ఇరు జట్లు తలపడతున్నాయి

చదవండి:Shubman Gill: గిల్‌ గురించి మీరు మాట్లాడేది తప్పు: జర్నలిస్టుకు విక్రమ్‌ కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement