భారత జట్టు శ్రీలంక పర్యటన.. ఎప్పుడంటే? | India To Tour Sri Lanka In July-August 2024 For 6 Match White Ball Series After T20 World Cup - Sakshi
Sakshi News home page

IND Vs SL White Ball Series: భారత జట్టు శ్రీలంక పర్యటన.. ఎప్పుడంటే?

Published Wed, Nov 29 2023 1:27 PM

India to tour Sri Lanka in July 2024 after T20 World Cup - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2024 ముగిసిన తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూలైలో వైట్‌ బాల్‌ సిరీస్‌ కోసం శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. తమ జాతీయ జట్టు వచ్చే ఏడాది ఫ్యూచర్‌ టూర్‌ పొగ్రామ్‌ను శ్రీలంక క్రికెట్ బుదవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత పర్యటను సంబంధించిన వివరాలను శ్రీలంక క్రికెట్‌ వెల్లడించింది. 

ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, వన్డే సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. ఇక వచ్చే ఏడాదిలో శ్రీలంక మొత్తం 52 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు ఉన్నాయి. అదే విధంగా టీ20 వరల్డ్‌‍కప్‌-2024లో కూడా శ్రీలంక ఆడనుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో సిరీస్‌తో శ్రీలంక క్రికెట్‌ జట్టు తమ కొత్త ఏడాదిని మొదలపెట్టనుంది. కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జూన్‌ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ ​మెగా టోర్నీ వెస్టిండీస్‌, అమెరికా వేదికలగా జరగనుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement