
క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న సూపర్ సిక్స్‌లో శుక్రవారం రెండో మ్యాచ్‌లో లంక తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.
ఈ దశలో ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేశాడు. ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు.