వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే అంశంలో శ్రీలంక మరింత దగ్గరైంది. క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌లో భాగంగా శుక్రవారం నెదర్లాండ్స్, శ్రీలంక మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 214 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 40 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌట్ అయింద.
ఒక దశలో నెదర్లాండ్స్ విజయం దిశగా నడిచి శ్రీలంకను వణికించింది. అయితే లంక బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో నెదర్లాండ్స్‌ను నిలువరించారు. కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ 68 బంతుల్లో 67 పరుగులు చేయగా.. వెస్లీ బార్సీ 52 పరుగులు, బాస్ డీ లీడే 41 పరుగుల చేశారు. లంక బౌలర్లలో మహీషా తీక్షణ మూడు వికెట్లు తీయగా.. వనిందు హసరంగా రెండు వికెట్లు పడగొట్టగా.. లాహిరు కుమారా, మధుషనక, షనకలు తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నెదర్లాండ్స్ బౌలర్ల దెబ్బకు పూర్తి ఓవర్లు ఆడకుండానే 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 96 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన లంక అసలు 150 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది.ధనుంజయ డిసిల్వా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 111 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డిసిల్వా 93 పరుగులు చేశాడు.
ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికి వన్డేల్లో కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. అతనికి అండగా వనిందు హసరంగా 20, మహీశ్ తీక్షణ 28 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే 33 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్, బాస్ డీ లీడేలు చెరో మూడు వికెట్లు తీయగా.. సాబిక్ జుల్పికర్ రెండు, రియాన్ క్లెయిన్, ఆర్యన్ దత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
ఈ విజయంతో శ్రీలంక వరల్డ్‌కప్ అర్హతకు మరింత చేరువైంది. ప్రస్తుతం లంక ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక నెదర్లాండ్స్ ఓటమితో ఇబ్బందుల్లో పడింది. డచ్ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇతర జట్ల ఓటములపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
Back on 🔝
— ICC Cricket World Cup (@cricketworldcup) June 30, 2023
Sri Lanka reclaim the No.1 spot in the Super Six Standings and are on the verge of booking their #CWC23 berth 🤩 pic.twitter.com/peX1Jfxmq4
చదవండి: #Ashes2023: స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
దెబ్బకొట్టిన నెదర్లాండ్స్; కెరీర్ బెస్ట్ ప్రదర్శనతో పరువు నిలిపాడు
Comments
Please login to add a commentAdd a comment