శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్‌ని వాయిదా వేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. "ఆగస్టు 1 నుంచి 21 వరకు జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ 2022ను తాత్కాలికంగా వాయిదా వేశాం. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది అని" శ్రీలంక క్రికెట్ ట్విటర్‌లో పేర్కొంది.
శ్రీలంక-పాకిస్తాన్ రెండో టెస్టు వేదిక మార్పు
శ్రీలంక-పాకిస్థాన్ రెండో టెస్టు వేదికను శ్రీలంక క్రికెట్ మార్పు చేసింది. కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ గాలెలో జరగనుంది. శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తల మధ్య ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పాక్-లంక మధ్య తొలి టెస్టు ప్రస్తుతం గాలే వేదికగానే జరుగుతోంది. కాబట్టి రెండో టెస్టు కూడా అక్కడే నిర్వహించడం సురక్షితమని శ్రీలంక క్రికెట్ భావించినట్లు తెలుస్తోంది.
ఆసియా కప్ కూడా కష్టమే
శ్రీలంక వేదికగా ఈ ఏడాది ఆగస్టులో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక, రాజకీయ సంక్షోబాల మధ్య శ్రీలంకలో ఆసియా కప్ జరిగేలా లేదు. ఆసియా కప్‌ను శ్రీలంక నుంచి యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు సమాచారం. ఇక జూలై 27న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యలు సమావేశం కానున్నారు. అనంతరం టోర్నీ షెడ్యూల్, వేదిక మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
Sri Lanka Cricket (SLC) wishes to announce that the Lanka Premier League 2022, which was scheduled to be held from 1st to 21st August, 2022 will be postponed, with immediate effect.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 17, 2022
#LPL2022https://t.co/Gb6yg3LK7k
చదవండి: Asia Cup 2022: శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్..!
Comments
Please login to add a commentAdd a comment