వారెవ్వా పతిరాన.. ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! ఒంటి చేత్తో | Matheesha Pathirana leaves David Warner frozen with mind-numbing catch | Sakshi
Sakshi News home page

IPL 2024: వారెవ్వా పతిరాన.. ఐపీఎల్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌! ఒంటి చేత్తో

Published Sun, Mar 31 2024 9:29 PM | Last Updated on Mon, Apr 1 2024 10:18 AM

Matheesha Pathirana leaves David Warner frozen with mind-numbing catch - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా వైజాగ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు మతీషా పతిరనా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. పతిరనా అద్భుతమైన క్యాచ్‌తో ఢిల్లీ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకు ఓపెనర్లు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

తొలి ఓవర్‌ నుంచే సీఎస్‌కే బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొదటి 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఢిల్లీ ఏకంగా 91 పరుగులు చేసింది. ఈ క్రమంలో సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. పేసర్‌ ముస్తఫిజర్‌ రెహ్మాన్‌ను బౌలింగ్‌ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ 10 ఓవర్‌ వేసిన ముస్తఫిజర్‌ మూడో బంతిని స్లో డెలివరీగా సంధించాడు.

ఆ బంతిని వార్నర్‌ షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా రివర్స్ ల్యాప్ షాట్‌ ఆడాడు. ఈ క్రమంలో షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌లో ఉన్న పతిరనా తన కుడివైపున్‌కు గాల్లోకి జంప్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో డేవిడ్‌ వార్నర్‌ ఒక్కసారిగా షాక్‌ అయిపోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో పతిరాన బౌలింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 3 వికెట్లు పడగొట్టి 31 పరుగులిచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement