లంక ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ (2023)కు సంబంధించి, లీగ్‌లో పాల్గొనే 5 జట్లు తమ ఐకాన్ (లోకల్, ఓవర్‌సీస్), ప్లాటినం (లోకల్, ఓవర్‌సీస్) ప్లేయర్లతో ఒప్పందం చేసుకున్నాయి. ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌కు నిర్ధేశిత తేదీ జూన్ 11 అయినప్పటికీ.. ఆయా జట్లకు ముందుగానే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగింది.
ఎల్‌పీఎల్‌లో తొలిసారి ఆడుతున్న కొలొంబో స్ట్రయికర్స్.. తమ ఐకాన్ ప్లేయర్‌గా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను, మిగతా సభ్యులుగా పాక్ స్పీడ్‌స్టర్ నసీం షా, లోకల్ టీ20 స్టార్ చమిక కరుణరత్నే, ఐపీఎల్-2023తో ధోని శిష్యుడిగా మారిపోయిన జూనియర్ మలింగ మతీష పతిరణను ఎంపిక చేసుకుంది.
గాలే గ్లాడియేటర్స్.. బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ను.. డంబుల్లా ఔరా మాథ్యూ వేడ్‌ను.. క్యాండీ ఫాల్కన్స్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను.. జాఫ్నా కింగ్స్ డేవిడ్ మిల్లర్‌ను తమ ఓవర్‌సీస్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక చేసుకున్నాయి.
ఎల్‌పీఎల్-2023 కోసం ఆయా జట్లు ఎంపిక చేసుకున్న ఆటగాళ్ల వివరాలు..
Comments
Please login to add a commentAdd a comment