
శ్రీలంక యువ పేస్ సంచలనం మతీషా పతిరానా ఐపీఎల్-2023లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ తరపున బరిలోకిన దిగిన పతిరానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్ యాక్షన్‌ను పోలివున్న 20 ఏళ్ల పతిరానా.. తన స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు.
ముఖ్యంగా ఎంఎస్ ధోని సారథ్యంలో పతిరానా మరింత రాటుదేలాడు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన పతిరానా.. ఇప్పుడు శ్రీలంక జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. అతడు ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఓ స్పోర్ట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతిరనా కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే సారధి ఎంఎస్ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అని అతడు తెలిపాడు.
"ఒక యువ ఆటగాడిగా కెరీర్‌ను మొదలపెట్టినప్పుడు ఎవరైన భరోసా కల్పిస్తే అది మనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్ నాకు మద్దతుగా నిలిచాడు. నాపై చాలా నమ్మకం ఉంచాడు. ఆ సమయంలో నేను ఏదైనా చేయగలనని నమ్మాను. నాకే కాదు.. చాలా మంది యువ ఆటగాళ్లకు ధోని సపోర్ట్‌గా నిలిచాడు.
మా జట్టులో నలుగురు, ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయపడిన సమయంలో.. ధోని యువ ఆటగాళ్లపై చాలా నమ్మకం ఉంచాడు. అతడు నిజంగా చాలా గ్రేట్. ధోని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అతడి ప్రశాంతత, వినయం నన్ను ఎంతగానే అకట్టుకున్నాయి. అందుకే అతడు తన కెరీర్‌లో విజయవంతమయ్యాడు.
42 ఏళ్ల వయస్సులో కూడా ఎంఎస్ చాలా ఫిట్‌గా ఉన్నాడు. ధోని మా లాంటి యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.నేను సీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చాలా చిన్నవాడిని. అప్పడు ధోనినే నాకు చాలా విషయాలు నేర్పించాడని పతిరానా పేర్కొన్నాడు.
చదవండి: #Rishabh Pant: బ్యాట్ పట్టిన రిషబ్ పంత్.. సిక్సల వర్షం! వీడియో వైరల్