IPL 2024: సీఎస్‌కేకు బిగ్ షాక్!(PC: BCCI/IPL)
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు చేదువార్త! ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు ఆ జట్టు కీలక బౌలర్ దూరం కానున్నట్లు సమాచారం. సీఎస్‌కే డెత్ ఓవర్ల స్పెషలిస్టు, శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ గాయపడినట్లు తెలుస్తోంది.
గత వారం బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా.. తొడకండరాల నొప్పితో పతిరణ జట్టును వీడాడు. ఈ క్రమంలో అతడికి దాదాపు నాలుగు- ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఫలితంగా అతడు.. ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది.
ఈ విషయం గురించి సీఎస్‌కే అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లన్నాక గాయాలు సహజమే. అతడి గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుతో మేము చర్చించాల్సి ఉంది. మా ప్రీమియర్ బౌలర్లలో తనూ ఒకడు’’ అని పతిరణ ప్రాధాన్యాన్ని వివరించారు.
కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ పతిరణ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన 21 ఏళ్ల పతిరణ.. ఐపీఎల్-2023 సీజన్‌లో అద్భుతంగా రాణించాడు.
మొత్తంగా 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు పతిరణ. చెన్నై ఐదోసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు గానూ.. పతిరణను సీఎస్‌కే రిటైన్ చేసుకుంది.
ఇక పతిరణ గనుక ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే అతడి స్థానంలో బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ సీఎస్‌కే డెత్ బౌలింగ్ దళంలో చోటు దక్కించుకోనున్నాడు. కాగా మార్చి 22న సీఎస్‌కే- ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో తాజా ఐపీఎల్ ఎడిషన్‌కు చెపాక్ వేదికగా తెరలేవనుంది.
చదవండి: Rohit Sharma: రోహిత్ భయ్యా తిడతాడు కానీ... టీమిండియా నయా స్టార్
Comments
Please login to add a commentAdd a comment