టీమిండియాతో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20లో పతిరాన గాయపడ్డాడు. పల్లెకెలె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో బంతిని ఆపే క్రమంలో పతిరాన భుజానికి గాయమైంది.
వెంటనే అతడు మైదానాన్ని విడిచి వెళ్లాడు. అయితే అతడి గాయం తీవ్రమైనది కావడంతో రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు సమాచారం. ఈ క్రమంలో పతిరాన భారత్‌తో వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్ధానాన్ని యువ పేసర్ మహ్మద్ షిరాజ్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది.
కాగా టీ20 సిరీస్‌ను శ్రీలంక కోల్పోయినప్పటకి పతిరాన మాత్రం అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లతో శ్రీలంక తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇక మహ్మద్ సిరాజ్ విషయానికి వస్తే.. డిమాస్టిక్ క్రికెట్‌లో అతడికి మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 47 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన షిరాజ్.. 80 వికెట్లు పడగొట్టాడు. కాగా ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.
భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, షిరాజ్, అసిత ఫెర్నాండో
Comments
Please login to add a commentAdd a comment