వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పతిరానా ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలో తప్పకున్నాడు.
ఇక పతిరానా స్ధానాన్ని సీనియర్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. ఇప్పటికే భారత్‌కు చేరుకున్న మాథ్యూస్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు.
ఈ మెగా టోర్నీలో ఆక్టోబర్ 26న బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక తలపడనుంది. కాగా ఇప్పటికే గాయం కారణంగా లంక కెప్టెన్ దసన్ శనక టోర్నీ మధ్యలోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పతిరానా కూడా దూరం కావడం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్ లెజెండ్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment